కల్యాణ్ రామ్ కథానాయకుడిగా కె.వి గుహన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నివేధా ధామస్, షాలినీ పాండే కథానాయికలు. ఈ సినిమా టైటిల్ ఈరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అదే.. `118`. ఇదో థ్రిల్లర్. దానికి తగినట్టే టైటిల్ని నిర్ణయించారు. ఈ చిత్రానికి `118` అనే టైటిల్ ఖరారు చేయనున్నారని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఆ టైటిలే ఖాయమైంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానరంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 2019న ఈ చిత్రం విడుదల కానుంది. సంక్రాంతికి ఎలాగూ భారీ చిత్రాలు వస్తున్నాయి కాబట్టి… ఆ హడావుడి తగ్గాక జనవరి చివరి వారంలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.