‘కవచం’ ప్రెస్ మీట్లో… కాజల్ – చోటా ముద్దు సీన్ మహా వేడి పుట్టించింది. అదే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. మాట్లాడుతూ మాట్లాడుతూ…. సందట్లో సడేమియాలా.. కాజల్ మెడపై ఓ ముద్దు పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు ఛోటా కె. నాయుడు. ఈ ముద్దు గురించి టాలీవుడ్‌లో హాట్ చర్చ సాగింది. ఛోటా అలా వేదికపై ముద్దు పెట్టడమేంటని… చాలామంది విమర్శించారు. కాజల్ ఫ్యాన్స్‌కి ఛోటా ఓ ట్రోల్‌లా దొరికిపోయాడు. ‘ఛాన్స్ పే డాన్స్’ అంటూ.. కాజల్ కూడా చోటాపై కౌంటరేసింది.
ఇప్పుడు ఈ ముద్దుపై మరోసారి స్పందించింది. ”ఈ విషయాన్ని నేనేం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ సంఘటన తరవాత.. చోటా నాతో మాట్లాడారు. `నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా.. అలా అయితే సారీ` అంటూ వివరణ ఇచ్చారు. ఛోటా మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. ఆత్మీయుడు. అందుకే.. దాన్ని నేనేదో వివాదం చేయదలచుకోవడం లేదు. నేనూ సరదాగానే తీసుకున్నా” అంటూ సర్దిచెప్పింది కాజల్.