ఇప్పటి కథానాయికలకు టైమ్ సెన్స్ చాలా తక్కువ. సెట్‌కి చెప్పిన టైమ్‌కి వెళ్తారో లేదో తెలీదు గానీ, ఆడియో ఫంక్షన్లకూ, ప్రెస్ మీట్లకు, మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలకు చెప్పిన సమయానికి రారు. తాజాగా కాజల్ టైమ్ తప్పింది. ఈ రోజు `కవచం` సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్‌ని ప్రసాద్ లాబ్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఉదయం 10 గంటలకు కాజల్ ఇంటర్వ్యూకు మీడియా మొత్తం ప్రసాద్ లాబ్‌కి తరలివచ్చింది. కానీ కాజల్ చెప్పిన సమయానికి రాలేదు. తీరిగ్గా 11.45 నిమిషాలకు కాజల్ కారొచ్చి ప్రసాద్ లాబ్ ముందు ఆగింది. దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూసిన మీడియా.. కాజల్ కారు కనిపించగానే.. `బాయ్ కాట్` అని చెప్పి అక్కడి నుంచి నిష్కమించారు. ఈ పరిణామానికి కాజల్ కూడా షాక్ తింది. అంతకు ముందు తమన్నా కూడా అంతే. ఆదివారం 12 గంటలకు తమన్నా ఇంటర్వ్యూలకు ఏర్పాటు చేసింది `నెక్ట్స్ ఏంటి` చిత్రబృందం. తమన్నా మాత్రం తాయితీగా 3.30కి వచ్చింది. అయినా సరే… మీడియా ఓపిగ్గా ఎదురుచూసి, ఇంటర్వ్యూని పూర్తి చేసుకెళ్లింది. ఈసారి కాజల్ మాత్రం.. `బాయ్‌కాట్`కి గురైంది.