తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సెంటిమెంట్ రాజేయడంలో.. ముందు ఉంటారు. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాకు.. సరిహద్దు జిల్లాలతో ఉన్న తగాదాలను తెరపైకి తెస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సరిహద్దుగా ఉంటే.. ఆయన పంట పండినట్లే. ఇలాంటి వివాదాలు.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఆర్డీఎస్. దీనిని అడ్డం పెట్టుకునే… లేని పోని కల్పితాలతో… ప్రచారం ప్రారంభించిన మొదట్లో డీకే అరుణపై కేసీఆర్ విమర్శలు చేశారు. నీళ్లు తరలించుకుపోతూంటే.. ఆమె హారతులు పట్టారని ఆరోపించారు. దీంతో డీకే అరుణ్… ఓ రేంజ్లో ఫైరయ్యారు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని.. తన శైలిలో అడిగారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం నోరు మెదపలేకపోయారు. మళ్లీ ఆ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు.
మరోసారి.. మహబూబ్ నగర్ జిల్లా ప్రచారసభకు వెళ్లారు కానీ.. డీకే అరుణ హారతుల గురించి మాట్లాడలేదు. కానీ.. కర్నూలు జిల్లా నేతల్ని మాత్రం… విమర్శించారు. ముఖ్యంగా తూముల్ని పేల్చేస్తానన్న బైరెడ్డిని చంద్రబాబు ఎందురు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అలంపూర్ ఎన్నికల బహిరంగ సభలో “ఒరే కొడకా బైరెడ్డీ” అంటూ ప్రసంగించారు. దీనిపై బైరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను రాయలసీమ నా కొడుకునేనన్నారు. తనకూ నోరు ఉందని.. తాను .. కూడా” ల ….కొడకా.. దొంగ నాకొడకా.. లంబిడీ కొడకా” అని నా యాసలో తిట్టవచ్చు కానీ.. తానలా మాట్లాడనని హెచ్చరించారు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీస్కో. లేకుంటే ముక్కుకోసి చేతిలో పెడతా అని హెచ్చరించారు. తనను చూపించి తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని బైరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లా రైతుల్ని, నాయకులను నీటి దొంగలు అనడాన్ని తీవ్రంగా ఖండించారు.
నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి.. ఓ వర్గం మద్దతు లభిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచార సభల్లో వైఎస్‌ని దుర్మార్గుడు, దోపిడీదారుడిగా తిడుతున్నా…. ఆయనను.. ఆరాధ్యునిగా భావించే పార్టీ.. నేతలు… తెర వెనుక.. టీఆర్ఎస్ను గెలిపించమని.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తేనే .. ఏపీలో తమకు భవిష్యత్ ఉంటుందన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. అయితే చంద్రబాబుపై ఉన్న సహజ వ్యతిరేకతతో .. తమను.. అత్యంత దారుణంగా అవమానిస్తున్న టీఆర్ఎస్కు ఎలా ఓట్లేయాలా అని ఆ వర్గం ఓటర్లు.. ఆలోచనలో పడేలా.. కేసీఆర్ చివరి దశలో చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.