“ఒక్క జగన్ పై.. వంద కుట్రలు” అంటూ.. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. వైసీపీని పెట్టుకున్న తర్వాత ఉప ఎన్నికల్లో జగన్ మీడియా చేసిన ప్రచారం.. ప్రజల్లోకి బాగా వెళ్లింది. పాపం జగన్ అన్నట్లుగా.. అందరూ అనుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఫలితంగా.. ప్లాన్డ్ గా తెచ్చి పెట్టుకున్న ఉపఎన్నికల్లో జగన్ కు .. ఆయన పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజార్టీలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో రహస్య మిత్రుడు.. కేసీఆర్‌కు సహకరించడానికి కూడా.. సాక్షి మీడియా.. అదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. ” ఒక్క కేసీఆర్ – వంద తుపాకులు ” అంటూ బ్యానర్ ఆర్టికల్స్ రాయడం ప్రారంభించింది.
నిజానికి కేసీఆర్.. ఒక్కడేనా..? రాజకీయాలు, అధికారపరంగా విభజిస్తే..ఆయన ఒక్కడు కాదు.. అనేకుడు అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఓ వైపు.. సింగిల్‌గా పోటీ చేస్తున్నారని చెప్పుకున్నా… బీజేపీ, ఎంఐఎంతో ఆయన కూటమి కట్టినట్లు.. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎంఐఎంతో ఫ్రెండ్లీ పైట్అని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు. దానికితగ్గట్లుగానే.. ఎంఐఎం సిట్టింగ్ సీట్లలో.. హిందూ ఓట్లను చీల్చడానికి…కేసీఆర్ అభ్యర్థుల్ని నిలబెట్టారు. అలాగే మజ్లిస్ ఓవైసీ.. ముస్లిం ఓట్లు టీఆర్ఎస్కు వేయించడానికి.. తన అభ్యర్థుల్ని ఇంకెక్కడా పోటీ పెట్టలేదు. ఇక అధికార వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బీజేపీ.. డిపాజిట్ రాని చోట్ల కూడా అభ్యర్ధుల్ని నిలబెట్టింది. అంటే.. కేసీఆర్ మూడు పార్టీలతో కలిసి.. ఓ కనిపించని కూటమితో రంగంలోకి దిగారు.
ఇక ఆయన అనేకుడు అని చెప్పడానికి… మరో కారణం.. అధికారం. పోలీసుల పనితీరుపై హైకోర్టు వక్తం చేసిన చేసిన అభిప్రాయం.. ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరు చూస్తే.. కేసీఆర్ రాజ్యాంగ వ్యవస్థలన్నింటితోనూ కూటమి కట్టినట్లు స్పష్టమవుతుంది. ఇంతగా అనేకుడిగా మారిన కేసీఆర్‌ను ఒక్కడిగా ప్రొజెక్ట్ చేసి.. ఆయనపై .. రాజకీయంగా పోరాడుతున్న వారేదో.. తుపాకులు ఎక్కుపెట్టినట్లు రాసి.. సానుభూతి పెట్టి పెట్టాలనే ప్రయత్నం చేస్తోంది సాక్షి మీడియా. జగన్ కోసం.. సాక్షి మీడియా ఇలా చేస్తోందంటే.. అర్థం ఉంది కానీ… కేసీఆర్ కోసం ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి..!