ఆలేరులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నరసింహులు హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోత్కుపల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. అయితే ఇటీవల బాబు తో విభేదించి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చారు. ఈసారి ఆలేరు నియోజకవర్గం నుంచి డీఎల్ఎఫ్ తరఫున బరిలో నిలిచారు. అయితే ఎన్నికల ప్రచార సందర్భంగా బాగా కష్టపడి మోత్కుపల్లి కి, బీపీ పడిపోవడం, పల్స్ పడిపోవడం తో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి ఆయనను తరలించాల్సి వచ్చింది.
అయితే ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.