ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అని, నాలుగేళ్లకోసారి కారు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు అని వ్యాఖ్యానిస్తూ పవన్ ని విమర్శించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనంతపురం ప్రజా పోరాట యాత్ర సందర్భంగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.
ప్రజా పోరాట యాత్ర లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, తాను జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదని ప్రజా సమస్యల గురించి అక్కడ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తే దాని గురించి సమాధానం చెప్పడం చేతకాక తనమీద జగన్మోహన్రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “జగన్ మోహన్ రెడ్డి గారూ, నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే రాష్ట్రం విడిపోయిందా? నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే రాష్ట్రంలో అవినీతి పెరిగిందా ?నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల్లే మీ మీద సిబిఐ కేసులు పెట్టి మీరు జైల్లో కూర్చోవలసి వచ్చిందా? నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు మూతపడిందా? అని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. మేము వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీ తరపున తాము జగన్ మోహన్ రెడ్డి గారిని కోరింది ఒకటేనని, అదేంటంటే అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల గురించి మాట్లాడి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా తాము కోరామని, అయితే దానికి సమాధానం చెప్పకుండా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు . అలాగే కొంతమంది ముఠా రౌడీ లను చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ధైర్యం ఉంటే, చేగువేరా ని స్ఫూర్తిగా తీసుకున్న తమకు ఇంకెంత ధైర్యం ఉంటుందో ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు అలాగే మీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడటం పెద్ద విషయం కాదని, కానీ దానికి పవన్ కళ్యాణ్ సంస్కారం అడ్డు వస్తుందని, కానీ, ఇంకొకసారి ఇలాగే వైఎస్ఆర్సిపి నాయకులు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే వైఎస్సార్సీపీ నాయకుల అందరి వ్యక్తిగత జీవితాలను బజారుకు ఈడుస్తానని పవన్ కళ్యాణ్ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ , జగన్ ల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు