తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కోవడానికి ఏర్పడి ప్రజాకూటమిలో పోలింగ్ ముందు వరకూ సర్దుబాట్లు జరిగాయి. తెల్లవారితే పోలింగ్ జరుగుతుందనగా.. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో… కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా .. బీఎస్పీ బీఫాంపై ఎన్నికల్లో నిలబడిన మల్రెడ్డి రంగారెడ్డికి.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో.. టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి షాక్ తగిలినట్లయింది.
నిజానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం విషయం మొదటి నుంచి ప్రజాకూటమిలో.. గందరగోళంగా మారింది. ఆ టిక్కెట్‌ను.. ఎల్బీనగర్ నియోజకవర్గం ఆశిచిన సామరంగారెడ్డికి కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదు. చివరికి బీఫాం తీసుకున్నా… ఆయన ఎక్కడ రేసులో ఉండరో.. ఎక్కడ తప్పుకుంటారోనన్న ఉద్దేశంతో.. మల్‌రెడ్డిని సీన్లోనే ఉంచారు కాంగ్రెస్ నేతలు. చివరికి..మల్ రెడ్డినే గట్టి పోటీదారుగా మారారు. లగడపాటి రాజగోపాల్ కూడా.. గెలిచే ఇండిపెండెంట్ల జాబితాలో.. ఆయన పేరును చేర్చారు. దాంతో.. టీ పీసీసీ చీఫ్.. మల్‌రెడ్డితో మాట్లాడి.. ఆయనకే మద్దతు ప్రకటించారు. గెలిస్తే.. కాంగ్రెస్ వైపు వచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. నిజానికి మల్ రెడ్డికి ఇబ్రహీంపట్నంలో ఎడ్జ్ ఉందనే.. చాలా మంది రెబల్స్‌పై .. కాంగ్రెస్ వేటు వేసినా.. మల్ రెడ్డిపై మాత్రం వేటు వేయలేదు.
మల్ రెడ్డి ఇష్యూతో.. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్లు 12కి పడిపోయినట్లయింది. పటాన్ చెరు స్థానాన్ని టీడీపీకి కేటాయించినా… చివరికి కాంగ్రెస్ అభ్యర్థినే నామినేషన్ వేశారు. అయితే… ఈ వ్యవహారాలన్నీ.. పైకి… లుకలుకలుగా కనిపిస్తున్నా… కూటమిలో పార్టీలన్నీ.. ప్రత్యేకంగా… లాభనష్టాలు చూసుకోకుండా.. గెలిచే అభ్యర్థుల ప్రాతిపదికనే… పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నారని… రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.