“పవన్ కళ్యాణ్ నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. నాలుగేళ్లకొకసారి పెళ్ళాలని మారుస్తాడు. కార్లని మార్చినట్టు పెళ్ళాలని మారుస్తూ ఉంటాడు. ఇలాంటి పని మామూలు వాళ్ళు ఎవరైనా చేస్తే పోలీసులు బొక్కలో తోస్తారు.” – ఇవి పవన్ కళ్యాణ్ పై జగన్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు.
“వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి కించపరిస్తే బాగోదు. నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏమి అన్యాయం జరగలేదు. మీరు ప్రజాధనాన్ని కాల్ చేయడం వల్లనే ప్రజలకి అన్యాయం జరిగింది. మీరు ( జగన్) జైలులో వెళ్లి కూర్చోవడానికి నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమే కారణమా? ఇంకొకసారి ఇలాంటివి గత వ్యాఖ్యలు చేస్తే వైఎస్సార్సీపీ పార్టీ లోని అందరి వ్యక్తిగత జీవితాలను బజారుకు ఈడుస్తాను. మీ మీద మీ లాగా నాటు భాషలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి నా సంస్కారం నాకు అడ్డం వస్తోంది” – ఇవీ పవన్ కళ్యాణ్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు.
అయితే సోషల్ మీడియాలో, జగన్ అనుకూల మీడియా లో మాత్రం పవన్ కళ్యాణే బజార్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. పై రెండు వ్యాఖ్యలను ఒకసారి చదివితే ఎవరు నాటు భాషలో విమర్శలు చేశారో, ఎవరు వ్యక్తిగత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో, సులువుగానే అర్థమవుతుంది. అయినా కూడా జగన్ పార్టీ నేతలు, అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బజారు వ్యాఖ్యలుగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జగన్మోహన్రెడ్డిని అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఈ మధ్య తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు జగన్ వద్ద సమాధానం లేక పోవడంతోనో, లేదంటే ఆఫ్ట్రాల్ పవన్ కళ్యాణ్ కి తాను సమాధానం చెప్పడం ఏంటి అనే అహంకారం తోనో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా జగన్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అయితే ఈ వ్యక్తిగత విమర్శలను పవన్ కళ్యాణ్ బలంగా తిప్పి కొడుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను తిప్పికొట్టగానే, తిరిగి, పవన్ కళ్యాణ్ బజారు మాటలు మాట్లాడుతున్నాడని వైఎస్సార్సీపీ నేతలు, జగన్ అనుకూల మీడియా సుద్దులు చెబుతున్నారు.
ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలను పక్కన పెట్టి రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటే బాగుంటుంది.