భారతదేశానికి ఓ సర్వోన్నతమైన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వల్లే చాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారని మోడీ చెబుతూ ఉంటారు. మరి ఆ రాజ్యాంగాన్ని ఆ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందా ..? లేదా..? అనే దానిపై ప్రజల్లో చాలా రోజుల నుంచి సందేహాలు ఉన్నాయి. అలాంటి మరో పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో హంగ్ అంటూ వస్తే.. కచ్చితంగా విషయం గవర్నర్ చేతుల్లో ఉంటుంది. కానీ గవర్నర్ సర్వాధికారి కాదు. ఆయన గవర్నర్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. కానీ నడుచుకోకపోయినా… ఆయనను అడిగే వారు లేరు. ఇక్కడే కేంద్రం గేమ్స్ ఆడబోతోంది. కర్ణాటకలో ఆడిన ఆటలు ఇక్కడ కూడా చూసే అవకాశాన్ని కేంద్రం కల్పించే అవకాశాలు చాలా ఉన్నాయి.
తెలంగాణలో హంగ్ అంటూ వస్తే.. ఎవరు ఎక్కువ సీట్లు గెల్చుకుంటే… వారికి గవర్నర్ ముందు పిలుపునివ్వాలి. అది పార్టీ అయినా… కూటమి అయినా సరే. ఎన్నికలకు ముందు ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేశారు కాబట్టి… టీఆర్ఎస్ కన్నా.. కూటమికి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా.. వారికే ప్రభుత్వ ఏర్పటుకు అవకాశం ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 51 సీట్లు, ప్రజాఫ్రంట్‌కు 52 సీట్లు ..కాంగ్రె్‌సకు 48 సీట్లు, టీడీపీకి 4 సీట్లు వచ్చినా.. వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశాన్ని ఫ్రంట్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది.ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాఫ్రంట్ ముందుకు రాకపోయినా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెజారిటీని నిరూపించుకోలేక పోయినా తర్వాతి అవకాశం అతిపెద్ద పార్టీకి దక్కుతుంది. నుంది. అతి పెద్ద పార్టీ ముందుకు రాక పోయినా, లేదా మెజారిటీని నిరూపించుకోలేక పోయినా మూడో అవకాశంగా ఎన్నికల అనంతరం పొత్తులు పెట్టుకునే కూటమికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సుస్థిరప్రభుత్వం ఏర్పాటవుతుందన్న నమ్మకాన్ని ఆ కూటమి గవర్నర్‌కు కలిగించాల్సి ఉంటుంది.
కానీ కర్ణాటకలో మాత్రం… కేంద్రం డైరక్షన్స్‌తో ఆడిన గవర్నర్.. ఏ ఒక్క నిబంధననూ పట్టించుకోలేదు. రాజ్యాంగానికి తనదైన భాష్యం చెప్పుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీకి అవకాశం ఇచ్చారు. బేరసారాల కోసం ఏకంగా రెండు వారాల గడువు ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లడం, బల నిరూపణకు గడువును కుదించడంతో మంత్రివర్గ ఏర్పాటుకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. అక్కడి గవర్నర్ కన్నా… తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇంకా ఎక్కువ విధేయతను… ప్రధాని మోడీపైన.. బీజేపీపైన చూపిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్ … కేంద్రం మాటను జవదాటే అవకాశం లేదు. అంటే.. హంగ్ అంటూ వస్తే.. తెలంగాణలో భిన్నమైన రాజకీయాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఖాయంగా కనిపిస్తోంది.