రాజమౌళి సినిమా అంటే.. `మినిమం రెండేళ్లయినా పడుతుంది` అనే కామెంట్ వినిపిస్తుంటుంది. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌లతో ఈ సినిమా మొదలైనప్పుడే.. `వీరిద్దరూ రెండేళ్ల వరకూ మనకు కనిపించరు` అని ఫ్యాన్సే కౌంటర్లు వేసేసుకున్నారు. ఇప్పుడు అదే నిజం అవ్వబోతోందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే… ఈ సినిమా షూటింగ్ మరీ నత్తనడక పద్ధతిన సాగుతుందని సమాచారం. తొలి షెడ్యూల్ అయిపోయిందని… రాజమౌళి ప్రకటించారీ మధ్య. అందులో భాగంగా తెరకెక్కించింది ఓ ఫైట్ మాత్రమే. ఈ ఫస్ట్ షెడ్యూల్లోనూ మధ్యమధ్యలో కొన్ని రోజులు విరామం వచ్చింది. ఇప్పుడు రాజమౌళి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. కుమారుడు కార్తికేయ పెళ్లి ఈనెలలోనే. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో రాజమౌళి కుటుంబం మొత్తం బిజీగా ఉంది. పెళ్లయ్యేంత వరకూ… షూటింగ్‌కి విరామం తప్పదు. ఆ తరవాత… `వినయ విధేయ రామా` ప్రమోషన్లలో చరణ్ బిజీ అవుతాడు. మళ్లీ `ఆర్.ఆర్.ఆర్`కి ఊపొచ్చేది సంక్రాంతి తరవాతే. స్క్రిప్టు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే రాజమౌళి ముందుగా యాక్షన్ సీన్ తో ఈ సినిమాని మొదలెట్టాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఎప్పుడూ బౌండెడ్ స్క్రిప్టుతో సినిమా మొదలెట్టే రాజమౌళి.. తొలిసారి చేతిలో స్క్రిప్టు లేకుండా సినిమా ని సెట్స్‌పైకి తీసుకెళ్లిపోయాడన్నమాట.