తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల హవా ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. లగడపాటి రాజగోపాల్ ఐదుగురి పేర్లు ప్రకటించారు. మరో ఇద్దరు ముగ్గురు గెలుస్తారని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి లగడపాటి ప్రకటించిన ఐదుగురు ఇండిపెండెట్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఖమ్మం జిల్లా వైరా నుంచి కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసిన రాములు నాయక్, రామగుండం నుంచి టీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసిన కోరుకంటి చందర్ లు మాత్రమే విజయం సాధించారు. లగడపాటి ఐదుగురు ఇండిపెండెట్ల పేర్లు ప్రకటించారు. బోథ్ నుంచి అనిల్ కుమార్ జాదవ్, నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్ నుంచి టీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసిన జలంధర్ రెడ్డి గెలుస్తారని ప్రకటించారు. కానీ వీరెవరూ రేసులో కనిపించలేదు.
ఎక్కువ మంది మూడో స్థానానికే పరిమితం అయ్యారు. ఇండిపెండెంట్లు కానీ…స్వతంత్రులు కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున… ఎక్కువ మంది స్వతంత్రులు గెలుస్తారన్న ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా సంపాదించుకుంటుందని అనుకున్నారు. అనూహ్యంగా.. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు లభించింది. దీంతో… స్వతంత్రులు ఎవరూ గెలవలేకపోయారు. వైరా నుంచి రాములు నాయక్, రామగుండం నుంచి కోరుకంటి చందర్ లు మాత్రం.. అనూహ్య విజయం సాధించారు.
రాములు నాయక్ విజయం చివరి వరకూ దోబూచులాడింది. కోరుకంటి చందర్ కు మాత్రం.. మొదటి నుంచి ఆధిక్యత లభించింది. మజ్లిస్ పార్టీ కూడా… ఓ సీటును కోల్పోవడం ఈ ఎన్నికల్లో విశేషం. పోటీ చేసింది… ఎనిమిది చోట్లే అయినా… రెండింటిలో గెలవలేకపోయింది. సిట్టింగ్ సీటు అియన కార్వాన్ లో పరాజయం పాలైంది. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల పోలరైజేషన్.. టీఆర్ఎస్ వర్సెస్ కూటమి అన్నట్లుగా సాగడంతో… మరే పార్టీకి అవకాశం దొరకలేదు. వామపక్షాలు అసలు ఉనికి ని కోల్పోయాయి.