టీ ట్వంటి మ్యాచ్‌లో బంతి బంతికి ఉత్కంటే ఉంటుంది. అదే ఛేజింగ్‌లో చివరి బంతి వరకూ మ్యాచ్ జరిగి.. ఏ టీమ్ అయినా గెలవొచ్చు అన్నంత పరిస్థితి ఉంటే.. ధ్రిల్లర్‌గా చెప్పుకోవచ్చు. అలాంటి ధ్రిల్లర్ .. మధ్యప్రదేశ్‌లో ఆవిష్కృతమయింది. అది క్రికెట్ మ్యాచ్ కాదు.. పొలిటికల్ మ్యాచ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్… పదే పదే.. ఆధిక్యత మారుతూ… కాంగ్రెస్, బీజేపీల మధ్య దోబూచులాడుతూ సాగింది. ఓ గంటకు.. బీజేపీ ఆధిక్యంలో ఉంటే.. మరో గంటకు.. కాంగ్రెస్ పార్టీ అధిక్యంలోకి వస్తుంది. అసలేం జరుగుతుందో… ఎవరూ అర్థం చేసుకోలేనంత ఉత్కంఠగా.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరిగింది.
230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో… సాధారణ మెజార్టీకి కాంగ్రెస్ పార్టీ 2 సీట్ల దూరంలో నిలిచింది. ఆ పార్టీకి 114 సీట్లు దక్కాయి. బీఎస్పీకి రెండు, ఇతరులు ఐదు చోట్ల విజయం సాధిస్తే.. పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న బారతీయ జనతా పార్టీ 109 స్థానాల దగ్గర ఆగిపోయింది. కానీ.. ఇలా చివరి స్కోర్లు చెప్పుకుంటే… చాలా తక్కువగా చెప్పుకున్నట్లే. తొలుత.. కౌంటింగ్ ప్రారంభించినప్పుడు.. బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మెల్లగా పుంజుకుంది. చెరో వంద స్థానాలకు వచ్చిన తర్వాత అసలు డ్రామా ప్రారంభమయింది. మ్యాజిక్ మార్క్ కు కావాల్సిన 116 సీట్లకు.. మొదటి బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలోకి వెళ్లారు. కానీ.. ఆ తర్వాత అర గంటకే… బీజేపీకి ఉన్న సీట్లలో 16 చోట్ల ఆధిక్యం తగ్గిపోయి కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఇలా గంట గంటలకు.. చివరి వరకూ ట్రెండ్స్ మారుతూనే ఉన్నాయి. చివరికి 114 దగ్గర కాంగ్రెస్ , 109 దగ్గర బీజేపీ స్థిరపడింది. దీంతో.. ఐదు స్థానాలు ఎక్కువగా గెల్చుకుని.. కాంగ్రెస్ ఫోటో ఫినిష్‌లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకో ఇద్దరు ఎమ్మెల మద్దతు అవసరం.
మధ్యప్రదేశ్‌లో దాదాపుగా 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 1000 ఓట్లకు కాస్త అటూ ఇటుగానే… ఆధిక్యం సంపాదించారు. వీరిలో పది మందికి ఓట్లు తగ్గిపోయినా… పరిస్థితి వేరుగా ఉండేది. కానీ.. కాంగ్రెస్ పార్టీకి లక్ కలసి వచ్చింది. స్వల్ప మెజార్టీలతో గెలిచేవారు ఎక్కువగా ఉన్నా… సీటు .. సీటే కాబట్టి… అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది. బీఎస్పీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. వీరిలో ఎవరైనా ఇద్దరు మద్దతు ఇస్తే.. క బీజేపీ పని అయిపోయినట్లవుతుంది.