దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల వ్యవహారశైలి బాగోలేదని.. దేశానికి ఓ కొత్త మోడల్ కావాల్సిందేనని.. తాను దాన్ని తీసుకొస్తానని కేసీఆర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే.. ముందు తన పార్టీకి ఓ కొత్త మోడల్‌ను కేసీఆర్ ఆడాప్ట్ చేసుకుంటున్నారు. అదే తమిళనాడులోని అన్నాడీఎంకే మోడల్. ఇంకా చెప్పాలంటే జయలలిత మోడల్. పార్టీలో ఆమె సుప్రీం. ఏం చెబితే అది అంతే. ఇంకో వినిపించడానికి అవకాశం లేదు. తాను ఎవరికి పదవులిస్తే వాళ్లే ఫైనల్. నోరెత్తడానికి కూడా చాన్స్ లేదు. కచ్చితంగా ఇదే మోడల్‌ను కేసీఆర్.. తన పార్టీని అన్వయించేసుంకుంటున్నారు.
కుమారుడికి.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పట్టం కట్టిన తర్వాత … ఆ విషయాన్ని చెప్పేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్.. ఈ మోడల్‌ను… తన పార్టీకి అన్వయిస్తున్నట్లు మాటలు, చేతలతో చెప్పారు. ముందు ముందు… తను చెప్పిందే వేదమని.. ఎవరైనా నోరెత్తితే… పార్టీలో ఉండటం కష్టమన్న అభిప్రాయాలను బలంగా పంపారు. మంత్రి పదవుల విషయంలో.. ఎవరూ నోరెత్తరాదన్న హెచ్చరిక లాంటి సూచన ముందుగానే వచ్చింది. తాను ఎవరికి పదవులిస్తే.. వారే మంత్రులని… సీనియర్లు చాలా మందికి.. పదవులు రావని… అత్యంత విధేయులకు మాత్రమే పీఠాలు దక్కబోతున్నాయన్న సమాచారాన్ని అంతర్లీనంగా పంపారు. కొంత మంది ఎంపిక చేసిన వారికి ఈ సమాచారం అందడంతో… వారు గతుక్కుమనాల్సి వచ్చింది.
ఇక మంత్రి పదవులు ఇవ్వలేదని.. ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురి కాకుండా.. ఇప్పటి వరకూ.. కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇక ముందు అవి కూడా ఉండబోవని.. స్పష్టమైన ప్రకటన చేశారు. టీఆర్ఎస్లో రెండు పదవులు ఉండవని.. అయితే ప్రభుత్వ పదవి లేకపోతే.. పార్టీ పదవి మాత్రమే ఉంటుంది ప్రకటించారు. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు.. వేరే వాయిస్ వినిపించే అవకాశం లేదు. ఏకపక్షమైన ప్రజాతీర్పు తర్వాత .. కేసీఆర్ మరింత బలం పుంజుకున్నారు. ఆయన చెప్పిందే వేదం. ఇష్టమైతే ఉండాలి లేకపోతే లేదు. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ నేతలు.. ఎలా ఉండాలో..టీఆర్ఎస్ నేతలు అలా ఉండాలి. తప్పదు..!