“తల్లీకొడుకులు బెయిల్ మీద తిరుగుతున్నారు.. నా మీద ఆరోపణలు చేస్తున్నారు..” ఇదీ మోడీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రాహుల్, సోనియాలపై వేసిన సెటైర్లు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో సోనియా, రాహుల్ పై కేసులు నమోదయ్యాయి. నేరుగా కోర్టుల చుట్టూ తిరగాల్సి రాకపోయినా… తరచూ వార్తల్లోకి మాత్రం వస్తున్నాయి. అంటే.. మోడీ దెబ్బకు.. వీరు కూడా.. కేసుల నుంచి తప్పించుకోలేకపోతున్నారన్నమాట. మరి సాక్షి పత్రిక.. ఏం చెబుతోంది..? ఈ సోనియా, రాహుల్‌లు.. కేసుల నుంచి రక్షిస్తారనే ఒప్పందం మీద కాంగ్రెస్‌కు చంద్రబాబు మద్దతిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అందుకే.. ఏపీ సంపద అంతా దోచి పెడుతున్నారని కథనాల మీద కథనాలు రాసుకొస్తున్నారు. సమయం, సందర్భం కాకపోయినా.. సాక్షి పత్రికలో ఈ రోజు అదే బ్యానర్ దర్శనమిచ్చింది.
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి… బీజేపీ చేసిన మోసాన్ని తాను దేశం మత్తం తెలిసేలా పోరాటం ప్రారంభించానని..ఆ ప్రభావం… మూడు రాష్ట్రాల్లో కనిపించిందని చంద్రబాబు ఓ సమావేశంలో చెప్పారు. బీజేపీ ఓటమిలో తన పాత్ర కూడా ఉందన్నారు. ఈ మాటలతో సాక్షి పత్రిక… ఎక్కడికో వెళ్లిపోయారు. నిజానికి … చంద్రబాబు అన్న ఈ మాటలను వెటకారంగా .. ప్రజెంట్ చేసింది. అన్నీ తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటారని.. జగన్ మీడియా ప్రచారం చేసింది. కానీ అంతలోనే విధానం మార్చుకుని… చంద్రబాబు డబ్బులిచ్చారని.. అందుకే గెలిపించారని సీరియస్‌గా కథనాలు రాయడం ప్రారంభించారు. అశోక్ గెహ్లాట్ కొన్నాళ్ల కిందట.. అమరావతికి వచ్చి వెళ్లారు. విపక్షాల సమావేశం గురించి చర్చించారు. కానీ సాక్షికి మాత్రం.. గెహ్లాట్ … వచ్చింది డబ్బుల కోసమన్నట్లుగా తీర్మానించారు.
సాక్షి ఇంతగా చెబుతున్నట్లు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇంతగా..చంద్రబాబు ఎందుకు సహకరిస్తారు అనే డౌట్… ప్రజలకు వస్తుంది కదా.. దాన్ని సమర్థించుకోవడానికే.. చంద్రబాబును కేసుల నుంచి రక్షించడానికే వాదన తీసుకొస్తోంది. చంద్రబాబుపై ఏం కేసులు ఉన్నాయి…? ఒక వేళ ఉన్నా… కేసులు పెట్టే చాన్స్ఉంటే… ఇంతగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ నేతలు.. సైలెంట్‌గా ఉంటారా..? ఇప్పటి వరకూ ఏదో ఒకటి చేయరా..? అరకొర చాన్స్ ఉన్న చిదంబరాన్ని ఎప్పుడు జైలుకు పంపుదామా అని.. బీజేపీ చూస్తోంది నిజం కాదా..? లాలూను జైలుకు పంపలేదా..? శశికళ కలల్ని కల్లలు చేయలేదా..?. చేయడానికి బీజేపీకి అవకాశం ఉంది కానీ.. రక్షించడానికి కాంగ్రెస్ కు స్కోప్ లేదు. అయినా.. అదేదో కేసుల రక్షణ కోసం చంద్రబాబు చేస్తున్నట్లుగా కథనాలు రాస్తే.. పాఠకులు ఎలా నమ్ముతారు…?. ఒక వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చంద్రబాబును రక్షిస్తుందని అనుకుంటున్నారా..? అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని… జగన్ మీడియా ఫిక్సయిందా..? …
ఎలా చూసినా… వైసీపీ రాజకీయ విధానాల్లోలానే… సాక్షి ఎడిటోరియల్ విధానాల్లోనూ స్పష్టత కరవయింది. వారికి తెలిసింది ఒక్కటే…. చంద్రబాబుపై బురదజల్లడం. ప్రజలు .. పాఠకులు నమ్ముతారా… లేక తామే నవ్వుల పాలవుతామా అన్న అంశంపై మాత్రం వారు డోన్ట్ కేర్..!