” రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ద్వారా… పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందజేశాం. వాళ్లకు పూర్తి అగాహన ఉంది..” ఇదీ సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపిన విషయం. సుప్రీంకోర్టు తీర్పులో ఇది స్పష్టంగా ఉంది. దీన్ని చూసిన కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎప్పుడు కాగ్ రాఫెల్‌పై నివేదిక ఇచ్చింది..? పీఎసీ ముందుకు ఎప్పుడు వచ్చింది..? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీలో వచ్చాయి. పీఏసీ చైర్మన్ గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. కానీ కేంద్ర చెప్పిన కాగ్ రిపోర్ట్ ఎప్పుడూ.. పీఏసీ ముందుకు రాలేదు. మరి సుప్రీంకోర్టుకు ఎందుకు అబద్దాలు చెప్పారు…? . ఇదే మోడీ ప్రభుత్వంపై మరిన్ని అనుమానాలు పెంచేలా చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా రాఫెల్ డీల్ పై మరింత విస్తృతంగా చర్చ జరిగింది. తమకు క్లీన్ చిట్ వచ్చేసిందని బీజేపీ నేతలు సంబరపడిపోతున్నారు. కానీ రాఫెల్ డీల్‌లో ఇప్పటి వరకూ… సమాధానం రాని అనుమానాలను ఎవరు నివృతి చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
రాఫెల్ జెట్ ఫైటర్ల రేటు ఎలా పెరిగింది..?
హెచ్ఏఎల్ స్థానంలో రిలయన్స్ ఎలా వచ్చింది..?
ఆర్డర్ ఇచ్చిన జెట్ ఫైటర్లు ఎందుకు తగ్గాయి..?
సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కాకుండా ఎందుకు నిబంధనలు మార్చారు..?
ప్రభుత్వం , ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని అబద్దాలెందుకు చెప్పారు..?
ఫ్రెంచ్ కంపెనీకి చెల్లించిన నిధులకు అక్కడి ప్రభుత్వం గ్యారంటీ ఎందుకివ్వలేదు..?
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుమానాలు ప్రజలకు, పార్టీలకు వస్తున్నాయి. కానీ తీర్చెదవరు. సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో విచారణకు అంగీకరించకపోవడం అంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని… కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాఫెల్ లో స్కాం జరిగిందో లేదో తేల్చడానికి సుప్రీంకోర్టు సరైన వేదిక కాదని కాంగ్రెస్ అంటోంది.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి.. అన్ని పత్రాలు ముందు పెడితే.. అసలు ఏం జరిగిందో బయటకు వస్తుందని అంటున్నారు. రాహుల్ గాంధీ ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీం నిర్ణయంతో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. ప్రత్యామ్నాయ విధానాల్లో విచారణకు పట్టుబట్టాలని డిసైడయ్యారు. సుప్రీంకోర్టు తీర్పును…బీజేపీ తనకు అనుకూలంగా అన్వయించుకుని.. తప్పుడు ప్రచారం ప్రారంభించిందనే అభిప్రాయం అంతటా ఏర్పడింది.