విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో జరిగిన దాడి ఘటనపై… వైసీపీ చాలా పెద్ద పోరాటమే చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి వెళ్లాలని తాపత్రయ పడుతోంది. దానికి .. పిటిషన్ల మీద పిటిషన్లు వేసి హైకోర్టులో విచారణ జరిగేలా చూసుకుంది. పనిలో పనిగా కేంద్రం వద్దకు వెళ్లి.. తమకు ఉన్న పలుకుబడితో.. ఆ కేసును ఎలాగైనా… కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లోకి తీసుకోవాలని.. విజ్ఞాపన పత్రాలు అందించింది. కానీ కేంద్రం ఏం చేస్తోంది…? వైసీపీతో ఉన్న సత్సంబంధాలను కూడా.. మర్చిపోయి కామెడీ చేస్తోంది. హైకోర్టుకు అరకొర సమాచారం ఇస్తూ.. అదేమంత పెద్ద కేసు కాదని… పెట్టీ కేసు అన్నట్లుగా… తేలికగా చూస్తోంది. హైకోర్టులో కేంద్రం దాఖలు చేస్తున్న నివేదికలు చూస్తే ఇదే నిజం తేలిపోతోంది.
జగన్‌పై దాడి ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి… ఈ ఘటన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంలో పేర్కొన్న నేరాల కిందకు వస్తుందో రాదో చెప్పాలని గత విచారణ సమయంలో కేంద్రాన్ని ఆదేశించింది. దానిపై ఓ నివేదికను… కేంద్రం హైకోర్టులో దాఖలు చేసింది. అందులో హైకోర్టు అడిగిన అసలు విషయం కాకుండా… మిగతా కథ అంతా చెప్పింది. నిర్ణయం ఏదో హైకోర్టే తీసుకోవాలన్నట్లుగా నివేదిక ఇచ్చింది. దాంతో హైకోర్టు.. కేంద్రం తమతో పరాచికాలాడుతోందని.. ఆగ్రహించింది. కోడికత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తుందో చెప్పకుండా… ఆ బాధ్యతను తమపైకి నెట్టేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోడికత్తి ఘటన ఎన్‌ఐఏ చట్ట పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టంగా తెలియచేస్తూ సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని ఆదేశించింది.
కోడికత్తి కేసు ఘటనను జగన్ ఎక్కడికో తీసుకెళ్లాలనుకోవడంతో … కేంద్రానికి కూడా… ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని.. తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రాజకీయ కారణాలతో… ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను…. ఎన్‌ఐఏకు అప్పగిస్తే.. ఇక దేశ వ్యాప్తంగా విమాశ్రయాల్లో జరిగే.,. ప్రతి చిన్న ఘటననూ.. ఎన్‌ఐఏకే అప్పగించాల్సి వస్తుందనే భయం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అదే కోర్టు ఆదేశిస్తే తమ చేతికి మట్టి అంటదని అంచనా వేసుకుటున్నారు. అందుకే.. అరకొర సమాచారం ఇస్తూ.. చివరికి కోర్టును కూడా గందరగోళ పరుస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.