వెంకటేష్, నాగచైతన్య కలసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. బాబి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సింది. ముహూర్తాలు కూడా పెట్టుకుని పలుమార్లు వాయిదా వేసుకున్నారు. దానికి కారణం.. సురేష్ బాబు వ్యవహార శైలే అని తేలింది. కథలో సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రియేటీవ్ సైడ్… ఆయన హ్యాండ్ ప్రతీ సినిమాలోనూ ఉండాల్సిందే. ఈసారీ అంతే. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా చేయి చేసుకుంటున్నట్టు తేలింది. ఇప్పటికి దాదాపు ఏడెనిమిది సార్లు సీన్ ఆర్డర్లు, ట్రీట్మెంట్లూ మార్చుకుంటూ వెళ్లారట. అయినప్పటికీ సురేష్ బాబుకి సంతృప్తి కలగలేదని, ఇప్పటికీ స్క్రిప్టుపై ఆయన ఆమోద ముద్ర పడలేదని తెలుస్తోంది. దాంతో బాబి కాస్త అసంతృప్తికి గురవుతున్నాడట. ఇప్పటికే ఓసారి దర్శకుడి మార్పు జరిగింది. వ్యవహారం చూస్తుంటే… బాబి కూడా… ఈ సినిమాకి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. `మజిలి` కంటే ఈ సినిమానే ముందు సెట్స్‌పైకి తీసుకెళ్దామనుకున్నాడు నాగచైతన్య. ఎప్పటికీ `వెంకీ మామ` షెడ్యూల్ తేలకపోవడంతో…. `మజిలీ` సినిమా వైపు దృష్టిని ఫోకస్ చేశాడు. జనవరి లో షూటింగ్ గనుక మొదలవ్వకపోతే… బాబి ఈ సినిమా నుంచి తప్పుకునే ఛాన్సులున్నాయని టాక్.