పన్నుల సంస్కరణల్లో అతి పద్ద అడుగు జీఎస్టీ. ప్రచార యావతో మోడీ దీన్ని… భారీ ఎత్తున ప్రచారం చేయడంతో… ఓ కొత్త పన్ను ఏదో మోడీ వేస్తున్నరన్నట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మరుక్షణం.. సంబంధం లేకపోయినా.. ప్రతి వస్తువు రేటును పెంచేశారు. ఫలితంగా కేంద్రానికి రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. కొత్త పన్ను అనే భావనతో ప్రజల్లో… సరిగ్గా నిర్వహించలేక వ్యాపారుల్లో వ్యతిరేకత తెచ్చి పెట్టుకుంది. ఇప్పుడు ఎన్నికలొస్తున్న సమయంలో ఏం చేయాలో తెలియక… కొత్త కొత్త ప్రయోగాలు ప్రారంభించింది.
అత్యధిక శ్లాబును తగ్గిస్తే.. ప్రజాగ్రహాన్ని కొద్దిగైనా తగ్గించవచ్చనే ఆలోచనకు ప్రధాని మోడీ వచ్చారు. జీఎస్టీని మరింత సరళం చేయనున్న విషయాన్ని మోడీ సూచన ప్రాయంగా చెప్పారు. సామాన్యులు వినియోగించే దాదాపు అన్ని వస్తువులను 18 శాతం, లేదా దాని కంటే తక్కువ శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురానున్నామని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. 99 శాతం వస్తువులను 18శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. జీఎస్టీ విధానాన్ని సరళీకరణ చేయాలని … అది అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ వినిపిస్తూనే ఉంది. కానీ ఎప్పుడూ … కేంద్రం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.
కేంద్రం తీరును రాహుల్ చక్కగా ఉపయోగించుకున్నారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా… ప్రకటించి.. ప్రజల్లోకి వెళ్లేలా చేయగలిగారు. అంతే కాదు.. తాము వస్తే జీఎస్టీని తీసేస్తామని చెప్పిడం లేదు కానీ.. పేదలకు మరింత పన్నుమినహాయింపులు వచ్చేలా సరళీకరిస్తామని హామీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు మోడీ.. ఆ పనిని ఎన్నికలకు ముందే చేయాలని నిర్ణయించుకుంది. అయితే.. చేయాల్సిందంతా చేసినా.. ఎన్నికలకు ముందు.. ఏదో మొక్కుబడిగా.. ఎన్నికలకు చర్యలు తీసుకుంటే… ప్రజల్లో సానుకూలత రావడం కష్టమేననేది అనేక ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.