“లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకు పెద్దగా పబ్లిసిటీ రావడం లేదని… ఆర్జీవీ తెగ ఫీలైపోతున్నారు. ఎవర్ని గెలికి లైన్లోకి తెచ్చే ప్రయత్నం చేసినా.. ఎవరూ పట్టంచుకోవడం లేదు. అందుకే .. గతంలో.. తనకు అదే పనిగా పబ్లిసిటీ తెచ్చి పెట్టిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దగ్గరకు మళ్లీ వచ్చారు. అయితే… ఈ సారి పవన్ ను నేరుగా విమర్శించకుండా.. ఆయన పక్కనున్న వారిని టార్గెట్ చేసి… తనదైన శైలిలో సూచనలు, సలహాలిచ్చి హాట్ టాపిక్ అవుతున్నారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలో ” వెన్నుపోటు” అనే పాటను… రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దాని గురించి పట్టించుకున్న వారు. అందుకే.. వెన్నుపోటు అనే అంశం ఏకంగా ఓ కథ రాసేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆర్జీవీ చెప్పిన ఈ వెన్నుపోటు కథ… ఆయన సినిమాల్లాగేనే.. రియలిస్టిక్‌గా ఉంటుంది. అంటే.. నిజమైన క్యారెక్టర్లను చూపించి… కల్పిత కథను సృష్టిస్తారన్నమాట. పవన్ కల్యాణ్‌ను నాదెండ్ల మనోహన్ వెన్నుపోటు పొడుస్తారనేది కథలో ప్రధాన అంశం. దీనికి సాక్ష్యంగా… ఆయన ఓ చిత్రమైన పోలిక తెచ్చారు. అప్పట్లో యన్.టి.ఆర్ పక్కన నిలబడి నాదెండ్ల మనోహర్ తండ్రి ఎలా అయితే నవ్వేవాడో.. ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ సేమ్ అలాగే నవ్వుతున్నారట. దీని గురించే ఆర్జీవీ ఆందోళన చెందుతున్నారట. దీనికి మీడియాటిక్ కంక్లూజన్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి, జనసేన అంతర్గత వర్గాల నుంచి, నేరుగా నాదెండ్ల మనోహర్ ఇంటి సభ్యుల నుంచి కూడా తనకు ఆ సమాచారం వస్తోందట.
ఆర్జీవీ ట్వీట్లు జనసేనలో కాక రేపడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎప్పుడైతే నాదెండ్ల పార్టీలో చేరారో.. అప్పట్నుంచి పవన్ కల్యాణ్ పక్కనే ఉంటున్నారు. ఏ కార్యక్రమం అయినా ఇద్దరే కనిపిస్తున్నారు. గతంలో ఉన్న వాళ్లు పక్కకు తప్పుకున్నారు. నాదెండ్ల కు దక్కుతున్న ప్రాధాన్యంపై.. పార్టీలో కొంత మంది అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆర్జీవీ ట్వీట్లు ఆ పార్టలో కొంత మందికి నైతిక బలాన్నిస్తాయి. పొర పాటున.. పవన్ కల్యాణ్ మనసులో ఏ మూల అయినా అనుమానం ప్రారంభమయిందంటే.. ఇక .. నాదెండ్ల పని అవుట్…!
I heard from a inside source that covert intelligence agencies to inside Janasena core team to even Nadendla Manohar ‘s house members that NM is planning to politically backstab @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) December 20, 2018
. @PawanKalyan fans thama star ki cheppalsindhi Vaalla hero yentha super star ayina vennu potu nunchi NTR kaadhu kadha PK kooda thappinchukoledu
— Ram Gopal Varma (@RGVzoomin) December 20, 2018
Dear @PawanKalyan fans,I am just worried about Nadendla Manohar constantly smiling when standing next to PK because his father used to do exact the same standing next to NTR..Please tell PK to be careful pleaaase ???
— Ram Gopal Varma (@RGVzoomin) December 20, 2018
As a fan of @PawanKalyan Am just praying to Lord Balaji that Nadendla Manohar won’t vennu potu superstar pawan kalyan the way his father vennu potued superstar NTR ..I request all PK fans to advise their Hero
— Ram Gopal Varma (@RGVzoomin) December 20, 2018