2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ.. విడతల వారీగా..టీఆర్ఎస్లో చేరిపోయారు. ముందుగా చేరిన వారిపై .. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్లు .. స్పీకర్‌కు… అనర్హతా పిటిషన్లు వేశారు. ఆ తర్వాత ఎర్రబెల్లి కూడా చేరిపోయారు. అదే ఎర్రబెల్లి తను పుట్టి పెరిగి.. పెద్ద చేసిన పార్టీని… తన చేతుల్తో తనకే మాత్రం అధికారం లేకపోయినా… టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు .. స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఆ లేఖకు వెంటనే ఆమోదం లభించింది. మరి అంతకు ముందే… అదే ఎర్రబెల్లి ఇచ్చిన అనర్హతా పిటిషన్ల సంగతేమిటి..?. మిగిలిన ముగ్గురు టీడీపీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారు..?. ఇవన్నీ సమాధానం ప్రశ్నలుగానే ఉన్నాయి. అప్పుడు టీడీపీకి వచ్చిన దుస్థితి ఇప్పుడు శాసనమండలిలోల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇది తమ ఇజ్జత్‌కు వచ్చిన సమస్య కాబట్టి.. కాంగ్రెస్ నేతలు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీ… ఇతర రాష్ట్రాల్లో.. కేసీఆర్‌లా ఎవరైనా రాజకీయం చేశారా..? అలాంటి రాజకీయాల విషయంలో కోర్టులు ఏం చెప్పాయన్న అంశాన్ని బయటకు లాగుతున్నాయి. 2007లో బీఎస్పీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన ఘటనలో… 2014లో హర్యానా జనహిత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సమయంలోనూ..అక్కడి స్పీకర్లు విలీన వేషాలు వేశారు. దాన్ని కోర్టులు కొట్టి వేశాయి. ఆ తీర్పుల్ని… కాంగ్రెస్ నేతలు సేకరించారు. రెండు, మూడు రోజులుగా.. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదిపులు జరుపుతున్నారు. సోమవారం కోర్టులో పిటిషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అప్పటికే టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనర్హతా పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా.. వాటిపై నిర్ణయం తీసుకోకుండా… వారిచ్చిన విలీన లేఖను.. అంగీకరించడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన అని కాంగ్రెస్ చెబుతోంది. అదీ కాకుండా.. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అలాంటి పార్టీకి చెందిన ఓ రాష్ట్ర శాఖను.. మరో పార్టీలో ఎలా విలీనం చేస్తారని.. ఇది ఏ నిబంధన కింద కరెక్టవుతుందని ప్రశ్నిస్తున్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే.. వారికి ఊరట దక్కకుండా.. టీఆర్ఎస్ వేగంగా స్పందిస్తోంది. ప్రతిపక్ష హోదాను రద్దు చేసి పడేసి.. షబ్బీర్అలీకి ఉన్న ప్రతిపక్ష నేత హోదాను పీకేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ఎంత కసిగా ఉందంటే… శాసన మండలి వెబ్సైట్లో.. ప్రతిపక్ష నేత హోదా పేరుతో.. ఉన్న షబ్బీర్ అలీ ఫోటోను కూడా.. క్షణాల్లో తీసేశారు.. !