టాలీవుడ్ నటి అపూర్వ , టిడిపి ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారని, మానసిక క్షోభకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
నటి అపూర్వ అల్లరి నరేష్ తొలి చిత్రమైన అల్లరి ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఎన్నో చిత్రాలలో సహాయ పాత్రలు చేస్తూ ఉన్నారు. ఆమధ్య క్యాస్టింగ్ కౌచ్ సమస్య విషయంలోనూ మహిళల పక్షాన గళమెత్తారు. అలాగే ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆవిడ భగ్గుమన్నారు. గ్రామం లోని తన ఇంటి దిమ్మ కి టిడిపి జండా కడుతుంటే వారించినందుకు చింతమనేని ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని ఆవిడ అన్నారు . చింతమనేని వల్ల ఎదురైన ఆ ఇబ్బందుల కారణంగానే గ్రామంలోని తన ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది అని నటి అపూర్వ అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో తన పై దుష్ప్రచారం చేస్తూ చింతమనేని అనుచరులు వేధిస్తున్నారని ఇప్పుడు ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతంలో చింతమనేని కేంద్రంగా ఇలాంటి వివాదాలు చాలానే జరిగాయి . ఏది ఏమైనా చింతమనేని పై చట్టాలు పనిచేయవేమోనని ఇప్పటికే చాలామంది సెటైర్లు వేస్తూ ఉండగా, ఇప్పుడు ఈ సంఘటన మరొకసారి అదే విషయాన్ని నిరూపించే లా ఉంది.