హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ వదలటంలేదు. శనివారం మళ్ళీ ఏసీబీ అధికారులు సండ్రకు నోటీసు ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలలోగా విచారణకు రావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సండ్ర ఇంటికి వెళ్ళిన అధికారులు ఆయన అక్కడ లేకపోవటంతో గోడకు నోటీసు అంటించి వెళ్ళారు. మరోవైపు ఖమ్మంలో ఉన్న సండ్ర ఈ నోటీసుపై స్పందించారు. తాను గడువులోగా ఏసీబీ అధికారులముందు హాజరవుతానని మీడియాకు తెలిపారు. ఆయన ఇటీవల తాను అనారోగ్యంనుంచి కోలుకున్నానని, ఏసీబీ ముందు హాజరవటానికి సిద్ధమని లేఖ రాసిన సంగతి తెలిసిందే.