విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మరో చైనా కంపెనీతో కలిసి ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. కడప స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేయబోతున్నారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాల దిన్నె గ్రామం వద్ద ఈ ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేస్తారు. రూ. 18వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో అదత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించారు. విభజన చట్టంలో కడప స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉంది.దీని ప్రకారం కేంద్రం నాలుగున్నరేళ్లుగా పరిశీలిస్తూనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ…కాలయాపన చేస్తూ వచ్చింది. ఐరన్ వోర్, విద్యుత్, నీరు, భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా చేస్తామన్నా కేంద్రం నుంచి స్పందన రాలేదు. దాంతో… సీఎంరమేష్, బీటెక్ రవి ఆమరణదీక్ష చేశారు. ఆయినప్పటికీ కేంద్రం దిగి రాలేదు. చివరికి చంద్రబాబు సీఎం రమేష్ తో దీక్ష విరమింప చేసి…కేంద్రానికి డెడ్ లైన్ పెట్టారు. కేంద్రం ముందుకు రాకపోతే.. తామే నిర్మించుకుటామన్నారు. ఆ మేరకు… కేంద్రం స్పందించకపోవడంతో.. ప్రకటించినట్లుగా.. శంకుస్థాపన చేస్తున్నారు. దీనిపై సీఎం రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు.
ఆమరణ దీక్షను విరమించిన తర్వాత సీఎం రమేష్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఓ ప్రతిజ్ఞ చేశారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసే వరకూ.. గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశారు. దాని ప్రకారం… ఆయన ఉక్కు కర్మాగారం అనంతరం తాను తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తానని ప్రకటించారు. ఇలా శపథం చేసి.. లక్ష్యం సాధించిన కడప నేతల్లో సీఎం రమేష్ రెండో వ్యక్తి. పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి.. గండికోట ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ గడ్డం తీయనని ప్రకటించి.. ఆ మేరకు … పనులు పూర్తయి.. నీళ్లు పారిన తర్వాత గడ్డం తీశారు.