ఈమధ్య మెగా బ్రదర్ నాగబాబు తరచుగా బాలకృష్ణ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి ఉద్దేశించి బాలయ్య బాబు గురించి చెప్పండి అని అడిగితే, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య గురించి మాట్లాడారు నాగబాబు. తాము అడిగింది బాలయ్య గురించి కాదని నందమూరి బాలకృష్ణ గురించి అని రిపోర్టర్ గుర్తు చేస్తే బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు నాగబాబు. ఆ తర్వాత మరొక వీడియో విడుదల చేస్తూ, బాలకృష్ణ ఎవరో తెలియదు అనడం తప్పే అని అంటూ బాలకృష్ణ గారు పాత కాలం హాస్యనటుల్లో అగ్రగామి అంటూ వల్లూరి బాలకృష్ణ గురించి మాట్లాడి మరొకసారి నందమూరి అభిమానులను కెలికారు నాగబాబు. ఆ రెండు సంఘటనలు చాలవన్నట్టు మరొకసారి తాజాగా నందమూరి బాలకృష్ణ పై పరోక్షంగా సెటైర్లు వేశారు నాగబాబు.
ఒక చిన్న పిల్లవాడు సారే జహాసే అచ్చా పాట ని అద్భుతంగా పాడిన ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఇంత చిన్న పిల్లాడైనా ఎంతబాగా పాడాడో కదూ హ్యాట్సాఫ్ టు హిం అని అభినందిస్తూ పోస్ట్ చేశాడు నాగబాబు. అయితే నాగబాబు ఎవరి పేరు ప్రస్తావించక పోయినప్పటికీ ఇది బాలకృష్ణ ఉద్దేశించిందని అందరికీ అర్థమైపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలక్రిష్ణ సారే జహాసే అచ్చా పాట ని ఖూనీ చేస్తూ బుల్ బుల్ అంటూ పాడిన విషయం తెలిసిందే. బాలకృష్ణ దేశభక్తి గీతాన్ని అలా ఖూనీ చేయడంపై ఎంతో మంది నెటిజన్లు విరుచుకుపడ్డారు, మరెంతో మంది సోషల్ మీడియాలో బాలకృష్ణ ని బాగా ట్రోలింగ్ చేశారు. 2018 సంవత్సరంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురైన నటుల్లో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి అంటే దానికి ఈ సారే జహాసే అచ్చా పాట ని బాలకృష్ణ ఖూనీ చేసిన తీరు కూడా ఒక కారణమే. దాంతో ఇప్పుడు నాగబాబు పేరు ప్రస్తావించక పోయినప్పటికీ బాలకృష్ణ ను ఉద్దేశించి నాగబాబు ఇలా చేశాడని బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు
https://www.facebook.com/NagaBabuOfficial/videos/vb.279714298886077/2012386839059744/?type=2&theater