తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు .. పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఢిల్లీలో పదుల సంఖ్యలో ప్రాంతీయ పార్టీల నేతలు ఉంటున్నా… పెద్దగా సమావేశాలు నిర్వహించడంలో కేసీఆర్ సక్సెస్ కాలేకపోతున్నారు. చివరికి ముందుగా.. కలవడానికి అంగీకరించిన వారు కూడా.. ముఖం చాటేస్తున్నారు. ఢిల్లీలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను కలిసేందుకు టీఆర్ఎస్ వర్గాలు సమయం తీసుకున్నాయి. తీరా కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత వారు.. కేసీఆర్ను వెయిటింగ్లో పెట్టి.. ” సారీ ” చెప్పేస్తున్నారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్… గతంలో ఓ సారి హైదరాబాద్కు వచ్చి.. కేసీఆర్ను కలిసి వెళ్లారు. ఈ సారి కేసీఆరే లక్నో వస్తానని కబురు పెట్టారు. తాను ఢిల్లీలో కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత టీఆర్ఎస్ వర్గాలు అఖిలేష్ను సంప్రదించాయి. అయితే..ఆయన ఏ విషయం చెప్పలేదు. చివరికి… తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని… కుదరదని చెప్పేశారు. అయితే..టీఆర్ఎస్ వర్గాలు నిరాశ పడకుండా… ఓ ప్రకటన చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను అభినందించారు. జనవరి ఏడు తర్వాత తానే హైదరాబాద్ వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. అయితే వాస్తవంగా.. ఢిల్లీలోని ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో.. అఖిలేష్ తో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. చివరికి అఖిలేష్ మనసు మార్చుకున్నారు.
ఇక బహుజనసమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి .. కూడా ఏ విషయం తేల్చకుండా… కేసీఆర్ను వెయిటింగ్లో పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం మాయావతి ఢిల్లీకి వచ్చారు. కేసీఆర్ అప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అయినప్పటికీ.. కేసీఆర్కు ఆమె సమయం ఇవ్వలేదు. టీఆర్ఎస్ వర్గాలు పదే పదే సంప్రదిస్తున్నప్పటికీ.. బీఎస్పీ వర్గాలు మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఈ రోజు మాయావతితో సమావేశానికి అవకాశం లేకపోతే.. కేసీఆర్ వెనుదిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలెవరూ.. పెద్దగా కేసీఆర్ను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.