80 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన టిడిపి నేత తన మనవరాలి వయసున్న అమ్మాయితో ఏకంగా పార్టీ ఆఫీసు లోనే రాసలీలలు సాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు, తమకు దమ్ముందని, మెరుగైన సమాజం కోసమే తాము పనిచేస్తామని చెప్పుకునే మహా మహా చానళ్లు ఆ వార్తను ప్రసారం చేయకపోవడం, దానిమీద ఎటువంటి డిబేట్ లో పెట్టక పోవడం చూసి అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతున్నారు.
నెల్లి సాధు రావు వైరల్ వీడియో
నెల్లి సాధు రావు. 85 ఏళ్ల వయసు. ఈయన తెలుగుదేశం పార్టీ కి చెందిన ఒక సీనియర్ లీడర్. విశాఖపట్నం లో జిల్లా అర్బన్ బిసి వింగ్ లీడర్ గా ఉన్నారు. ఆయనకు పార్టీ ఆఫీసు కూడా ఉంది. చక్కగా ఆఫీసులో అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహనీయుల చిత్రాలు కూడా పెట్టుకున్నాడు. ఆ ఆఫీసు సెటప్ ని, తలపండిన ఆయన గెటప్ ని చూస్తే ఎవరైనా ఆయన్ని చాలా మంచివాడు అనే అనుకుంటారు మరి. కానీ ఆయన అదే పార్టీ ఆఫీసులో, అదే అంబేద్కర్ , పూలే చిత్రాల బ్యాక్ డ్రాప్ లో తన మనవరాలి వయసున్న అమ్మాయి తో సాగించిన రాసలీలల కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన తెలిశాక, ఆ వీడియో చూశాక, మహిళా లోకం ముక్తకంఠంతో ఈ సాధు రావు చేసిన పనిని విమర్శించి, అతని పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఆ అమ్మాయి మైనర్ ఆ కాదా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఒకవేళ మైనర్ అయిన ఉంటే గనక చట్టపరంగా కఠినమైన శిక్షకు ఆస్కారం ఉంది. మైనర్ కాకపోయి ఉంటే, చట్ట పరంగా పెద్ద శిక్షలకు ఆస్కారం లేదు కానీ, పార్టీ ఆఫీసు లోనే ఇలాంటి చర్యలకు దిగడం పార్టీని అప్రతిష్టపాలు చేసే చర్య కాబట్టి పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
ఇప్పటిదాకా పార్టీ చర్యలు లేవు:
క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, సాధు రావు పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సంఘటన ఇతర రాజకీయ పార్టీలలో జరిగి ఉంటే గనక ఈపాటికే అనుంగు మీడియాలో పెద్దపెద్ద కథనాల తో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి స్టేట్మెంట్లు ప్రెస్ మీట్ లు కూడా వచ్చి ఉండేవి. ప్రస్తుతానికి ఈ పెద్దాయన పరారీలో ఉన్నాడు . మహిళా సంఘాల కంప్లైంట్ తర్వాత పోలీసులు ఆయన ఆఫీసుకు వెళ్లి చూసి, ఆ ఆఫీసుకు తాళం వేసి ఉందని నిర్ధారించారు.
దమ్మున్న , మెరుగైన మహా మహా చానల్స్ లు అన్నీ బజ్జున్నాయా?
తెలుగు రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్ లు, తెగ చురుగ్గా పనిచేస్తాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న అక్రమం జరిగినా వాలి పోతారని, రాజకీయ పార్టీలు అధికారికంగా చెక్కు రూపంలో డబ్బులు తీసుకున్నా, మానవత్వం మూర్తిభవించిన రిపోర్టర్లు మహా గొప్ప కెమెరాలతో స్టింగ్ ఆపరేషన్లు చేస్తారని, క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలను అస్సలు సహించరని, వందలాది గంటల పాటు అటువంటి సమస్యల మీద తెగ డిబేట్లు పెడతారని, కాలక్షేపం కోసం చూసే స్కిట్ లలో ఒక చిన్న పొరపాటు జరిగినా, ఒక చిన్నమాట జారినా ప్రైమ్ టైం లో నాలుగు ఐదు రోజుల పాటు ఆ సమస్యపై తీవ్రంగా చర్చిస్తారని సదభిప్రాయమో, దురభిప్రాయమో, ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అయితే ఆశ్చర్యంగా ఇప్పుడు ఆ దమ్మున్న చానల్స్, మెరుగైన సమాజం కోసం నిరంతరం శ్రమించే చానల్స్, మహా గొప్ప ఛానల్స్ అన్నీ కూడా ఒక రాజకీయ నేత తన మనవరాలి వయసున్న అమ్మాయి తో రాసలీలలు సాగిస్తే దానిమీద ఎటువంటి డిబేట్లు పెట్టకుండా, ఎటువంటి న్యూస్ ఇవ్వకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి.
నెటిజన్లు మాత్రం మరొకసారి ఈ ఛానల్ ల పై విరుచుకు పడుతున్నారు. అక్కడ దొరికిన ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన నేత కావడం వలననే ఈ ఛానల్స్ ఇలా ప్రవర్తిస్తున్నాయని, అదే ఇతర పార్టీలకు చెందిన నేత అయి ఉన్నా, అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అయినా ఈ పాటికి మహిళా సంఘాల నేతలతో తెగ డిబేట్ లు పెట్టి ఉండేవని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ చానల్స్ పూర్తిగా అధికారపార్టీకి బాకా ఊదడానికి తప్ప నిజమైన వార్తలు ఇవ్వడానికి, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి కట్టుబడి లేవు అని వారు విమర్శిస్తున్నారు.
మరి భవిష్యత్తులోనైనా ఈ ఛానల్ లు అలాంటి ముద్ర నుంచి బయటపడి నిష్పాక్షికంగా పనిచేస్తాయా అన్నది వేచి చూడాలి.
– జురాన్