తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… శనివారం రోజు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి… ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాను అడ్డుపడటం లేదని.. గతంలో తాను, కేకే, కవిత పార్లమెంట్లో మద్దతు ప్రకటించామని చెప్పుకొచ్చారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు.. అవసరం అయితే.. ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం.. మోడీకి లేఖ రాస్తానని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో… ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణ ఖల్లాస్ అవుతుందని.. అడగని వాళ్లకి.. అడిగిన వాళ్లకీ చెప్పిన కేసీఆర్ అండ్ పార్టీ లీడర్స్.. ఇప్పుడు ఒక్క సారిగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చాలా మందికి సింపుల్‌గానే అర్థమయింది. ప్రత్యేకహోదా అనే కండిషన్‌ను అడ్డంగా పెట్టుకున్న జగన్‌ను ఫెడరల్ ఫ్రంట్‌లోకి తీసుకు రావడానికేనని చాలా మందికి అంచనా వచ్చేసింది.
ఆదివారం పూట ఉదయం.. సాక్షి పత్రికలో అదే పెద్ద అక్షరాలతో బయటకు వచ్చింది. దాంతో.. ఇక ఫెడరల్ ఫ్రంట్ కోసం ఎంట్రీకి… మోదీకి కేసీఆర్ రాస్తానన్న ప్రత్యేకహోదా లేఖ.. జగన్‌కు ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానపత్రంలా అందరికీ అర్థమైపోయింది. మరి జగన్ అధికారికంగా స్పందించాలిగా..?. స్పందించేశారు కూడా..! పలాసలో బహిరంగసభలో.. చంద్రబాబును రోజూ చేసే విమర్శలకు తోడు.. కేసీఆర్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకహోదా కోసం లేఖ రాస్తామంటున్నారు. “ఆయనకు పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు.. మనకు పాతిక మంది ఎంపీలున్నారు. 42 మంది కలిసి హోదాకు మద్దతు తెలుపడానికి ఎవరైనా సంతోషిస్తారు. కానీ… చంద్రబాబు మాత్రం నీచ రాజకీయాలు చేస్తారంటూ”… ప్రకటించేశారు. ఈ ప్రకటనలో ఆయన తన ఉద్దేశాన్ని చాటి చెప్పకనే చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి.. ఆయనతో కలిస్తే తప్పు లేదు. అప్పుడు.. ఏపీ తెలంగాణకు కలిసి 42 సీట్లు అవుతాయి. వాటి ద్వారా… తాము ప్రత్యేకహోదా తీసుకు వస్తామన్న అర్థంలో చెప్పడమే. అంటే.. అంతిమంగా ఈ 42 సీట్లతో గెలిచినన్ని సీట్లు తీసుకు పోయి.. బీజేపీకి మద్దతిస్తారనే అర్థం. కేసీఆర్ బీజేపీ కోసం ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో బయట ఎక్కడా సక్సెస్ కాకపోయినప్పటికీ… ఏపీలో మాత్రం అవుతున్నారు. వైసీపీని మిత్రపక్షంగా చేసుకుంటున్నారు. దానికి జగన్ కూడా సై అంటున్నారు. ప్రజల్లో వచ్చే స్పందనను బట్టి.. జగన్ తన వాదనను.. తన మీడియా ద్వారా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.