ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రతీ రోజు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రంగాల్లో నాలుగున్నరేళ్ల అభివృద్ధిని కళ్ల ముందు ఉంచుతున్నట్లు చెబుతున్నారు. అ ప్రకారం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ శ్వేతపత్రాలపై… విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డబ్బా కొట్టుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకీ విమర్శలు వస్తున్నాయి..?
శ్వేతపత్రాల్లో అన్నీ నిజాలే ఉంటున్నాయా..?
మామూలుగా శ్వేతపత్రాలు అంటే… అప్పటికి.. విడుదల చేయాలనుకుంటున్న రంగంలోని పూర్తి పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ శ్వేతపత్రాలు మాత్రం.. కొంచెం భిన్నంగా ఉంటాయి. 2014లో కూడా ఆయన శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పటికీ అవన్నీ ఆన్ లైన్లో దొరుకుతాయి. ఎన్ని వైట్ పేపర్స్ విడుదల చేస్తే.. అన్ని రంగాల్లోనూ.. కామన్‌గా ఓ మాట ఉంటుంది. అదేమిటంటే.. 1995 నుంచి 2004 వరకు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ది చెందిందని చెప్పుకొస్తారు. అలాగే.. 2004 నుంచి 2014 వరకూ.. వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని చెబుతారు. ఇది కామన్‌గా ఉంటుంది. శ్వేతపత్రాల్లో అప్పుడు ఉన్న పరిస్థితి చెబుతారు కానీ.. వెనక్కి వెళ్లాల్సిన పని లేదు. కానీ రాజకీయంగా… తన పాలన బాగుందని చెప్పుకోవడానికి 1995 నాటి పరిస్థితితో పోలుస్తారు. ఆ రోజున వైట్ పేపర్స్ ఎందుకు రిలీజ్ చేస్తారు..? విభజన తర్వాత అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పడానికి విడుదల చేస్తారు. కానీ.. తన పాలన సమయం నుంచి చెప్పుకొచ్చి.. అదో రాజకీయ కరపత్రంలా మార్చారు. ఇప్పుడు.. రాజకీయాలు మారాయి కాబట్టి… అంత వెనక్కి వెళ్లకపోవచ్చు.
స్వతంత్ర నిపుణులతో శ్వేతపత్రాలు విడుదల చేయిస్తే బాగుండేది కదా..?
ఇప్పుడు చంద్రబాబు నాలుగున్నరేళ్ల కాలంలో..తన ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకోవడానికి… శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. కానీ.. ఆయన వైట్ పేపర్స్.. అలా కాకుండా… ఓ ఇండిపెండెంట్ సంస్థ ద్వారా.. రాజకీయాలకు సంబంధం లేదని సంస్థ ద్వారా సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రం ముందు ఉన్న ఉన్న సవాళ్లేంటి.. అనే పరి్సథితులను చెప్పడానికి శ్వేతపత్రాలను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు 2014కు ముందు.. ఏపీ పరిస్థితి ఏమిటన్నదానికపై.. స్వతంత్ర పరిశోధకులతో పరిశీలన చేయించి… రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లేంటి..? వాటిని ఎలా అధిగమించారు..? ఇప్పటికి మిగిలి ఉన్న సవాళ్లను ఎలా అధిగమిస్తారన్న అంశంపై… సూచనలు తీసుకుని ఉంటే… శ్వేతపత్రాలకు అర్థం ఉండేది. కానీ ఈ వైట్‌పేపర్స్ యొక్క కచ్చితమైన ఉద్దేశం ఏమిటంటే.. దిక్కూదివాణం లేని రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా అభివృద్ధి చేశారు అని చెప్పడానికే ఈ వైట్ పేపర్స్‌ను ఉపయోగించుకుంటున్నారు.
శ్వేతపత్రాలనడం కన్నా.. కరపత్రాలు అనడమే కరెక్టా..?
అయితే.. వైట్ పేపర్స్ ఇలా విడుదల చేయకూడదా.. అంటే చేయవచ్చు. అది ప్రభుత్వం ఇష్టం. మనమేం కాదనలేం. కానీ వీటిని… శ్వేతపత్రం అనలేం. కరపత్రాలు అనొచ్చు. ప్రభుత్వం ఈ రకమైన పనులు చేసింది… ఇంత అభివృద్ధి చేశాం… అని ఆ కరపత్రంలో చెప్పుకోవచ్చు. కరపత్రం పేరుతో విడుదల చేసినప్పుడు.. ప్రజలు కూడా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. వాళ్ల పాలన గురించి చెప్పుకుంటోంది అని చర్చించుకుంంటారు. ప్రభుత్వానికి అలా చెప్పుకునే హక్కు ఉంటుంది. కానీ శ్వేతపత్రం అని చెప్పడం వల్ల… వైట్ పేపర్‌కు ఉన్న… నిర్మలత్వం పోతుంది. వైట్ పేపర్ అంటే.. అన్నీ ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పడమే. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు.. ప్రభుత్వం కోణం నుంచే ఉంటున్నాయి. అందుకే ప్రతిపక్షాలు… విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు కూడా కొద్దిగా అనుమానంగానే చేస్తున్నారు. మరి దీన్ని అంగీకరిస్తారా..? అంటే.. ప్రభుత్వాన్ని అంగీకరించేవారు.. అంగీకరిస్తారు. లేని వారు అంగీకరించారు.
శ్వేతపత్రాలు స్టడీ మెటీరియల్‌గా మాత్రమే ఉపయోగపడతాయా..?
ఇప్పుడు.. ఈ వైట్ పేపర్స్ వల్ల ఉపయోగం ఏమిటి..? వాటిని అసలు ప్రజలు చదవుతారా…? ప్రజలకు అంత తీరిక ఉందా.. అంటే లేదనే చెప్పుకోవాలి. మరి ఎందుకు..? ఇవి ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు స్టీడీ మెటీరియల్‌గా ఉపయోగపడతాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత .. రెండు ప్రభుత్వాలకు రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడ్డాయి. వాటిలో తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణలో.. విభజన అనంతర పరిస్థితుల గురించి ఏపీలో … అంశాలు ఉన్నాయి. ఏపీలో.. విభజన అనంతర పరిస్థితులపై… పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. అలాంటి వాటికి.. ఈ శ్వేతపత్రాలు.. గొప్ప స్టడీ మెటీరియల్. అలాంటి వాళ్లు… మాత్రం కచ్చితంగా చదువుతారు తప్ప.. సామాన్య ప్రజలు చదవరు.
ఇప్పటి డున్న రాజకీయంలో ఎవరైనా ఇలాంటి శ్వేతపత్రాలు విడుదల చేయాల్సిందేనా..?
అందుకే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా.. లోటుపాటు..అభివృద్ధిని గురించి పక్కాగా మొత్తం వివరాలు వెల్లడించి చర్చకు ఆహ్వానించాలి. అప్పుడే శ్వేతపత్రాలకు అర్థం ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వ తన సొంతంగా.. ఏ ఒక్క నెగిటివ్ అంశాన్ని కూడా బయట పెట్టుకోదు. అలా పెట్టుకుంటే ప్రతిపక్షాలు రచ్చ చేస్తాయి. అందుకే.. ఇప్పుడున్న కాంపిటీవ్ పాలిటిక్స్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా… వైట్ పేపర్స్‌ను ఇంత కంటే భిన్నంగా విడుదల చేస్తుందని అనుకోలేం. వీటిలో తప్పులున్నాయని… ప్రతిపక్షం అంగీకరిస్తే.. తాము ఓ వైట్ పేపర్ని రిలీజ్ చేసి.. చర్చకు పెట్టవచ్చు. అలా పెడితేనే… ప్రజాస్వామ్యంలో.. వాస్తవాలు బయటకు వస్తాయి.