దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న ప్రకాష్ రాజ్… రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన కొత్త ఏడాది నిర్ణయంగా దీన్ని ట్విట్టర్లో ప్రకటించారు. అయితే.. రాజకీయల్లోకి అడుగు పెట్టాలంటే.. ఏదో ఓ పార్టీలో చేరడమో… పార్టీ పెట్టడమో కాకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. బహుశా అది కర్ణాటక నుంచే కావొచ్చు. స్నేహితురాలు, కన్నడ రచయిత్రి గౌరి లంకేష్ హత్య తర్వతా ప్రకాష్ రాజ్.. రాజకీయంగా ఎగ్రెసివ్‌గా మాట్లాడటం ప్రారంభించారు. నరేంద్రమోడీ విధానాలకు వ్యతిరేకంగా ” జస్ట్ ఆస్కింగ్” పేరుతో ఓ రకంగా క్యాంపెయిన్ నిర్వహించారు. దీనికి ఆయన ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.
నిజానికి ప్రకాష్ రాజ్ కు .. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఏ రాష్ట్రంలో అయినా రాజకీయం చేసే ఫ్లెక్సిబులిటీ ఉంది. కొంత సినిమా ద్వారా వస్తే.. మరికొంత తను సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు అవుట్‌రైట్ సపోర్ట్ చేయడం ద్వారా.. ఆయన ఓ అవకాశాన్ని గతంలోనే సృష్టించుకున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనల కోసం.. కర్ణాటక వెళ్లినప్పుడు, తమిళనాడు వెళ్లినప్పుడు ప్రకాష్ రాజ్ సాయం చేశారు. ఆ సమయంలో.. ప్రకాష్ రాజ్ ప్రగతి భవన్ ఆతిధ్యం తీసుకున్నారు కూడా. అప్పుడే… ప్రకాష్ రాజ్‌ను ఎంపీగా… తెలంగాణ నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు.. ప్రకాష్ రాజ్.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని ట్వీట్ చేశారు.
కన్నడ రాజకీయాల్లో ఉండాలనుకుంటే… ప్రకాష్ రాజ్ స్వతంత్రంగా పోటీ చేస్తారు. ఎలా అయినా ఎంపీ అయిన పార్లమెంట్లో ” జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రశ్నించాలనుకుంటే… దానికి టీఆర్ఎస్కు మించిన ఆప్షన్ ఉండదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్‌కు గొప్పగా సపోర్ట్ చేస్తూ టీవీ ఇంటర్యూలు ఇచ్చారు కాబట్టి… ఎంపీ సీటు ఇవ్వడానికి కేసీఆర్ వెనుకడుగు వేయకపోవచ్చు. కాకపోతే.. ప్రకాష్ రాజ్‌కు ఉన్న ఒకే ఒక్క అడ్డంకి ఆయన విధానాలు. ఆయనను ఎంపీని చేస్తే.. ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు..! టీఆర్ఎస్ విధానం దానికి వ్యతిరేకం..! ఈ విధానపరమైన అభిప్రాయబేధం తప్ప… టీఆర్ఎస్లో ప్రకాష్‌రాజ్‌కు రెడ్ కార్పెట్ పరవవొచ్చు. మరి దేన్ని ఎంచుకుంటారో..?