గవర్నర్ నరసింహన్.. గుళ్లూ గోపురాలకే ఎక్కువ తిరుగుతారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాల దగ్గర క్యాంప్ ఆఫీసులు కట్టిస్తే చాలని చాలా మంది సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇదే కారణంతో వీహెచ్ లాంటి కాంగ్రెస్ నేతలు ఆయనను రీకాల్ చేయాలని.. కేంద్రానికి లేఖలు రాస్తూ ఉంటారు. వాటి సంగతేమో కానీ.. ఆయన మాత్రం తన పద్దతుల్ని మార్చుకోరు. పైగా.. ఆశీర్వచనాల గురించి సంపూర్ణంగా ఔపాసన పట్టేసి… అదేదో .. ప్రోటాకాల్గా గుర్తుంచుకుని..తనకు అలాంటి ఆశీర్వచనాలు ఇవ్వలేదని.. ఏకంగా… రాజ్‌భవన్‌కు వచ్చి కలవండని చెప్పి.. అర్చకులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చిన ఘటన సోమవారం జరిగింది.
సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. సంప్రదాయ దుస్తులతో బాలాలయం చేరుకున్న ఆయనకు అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఉత్సవ మండపంలో గవర్నర్ దంపతులకు ప్రధానార్చకులు, ఇతర అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కానీ నరసింహన్‌కు ఆ ఆశీర్వచనంలో తేడా కనిపించింది. చతుర్వేద పారాయణం. మహాదాశీర్వచనం జరపకుండానే ఆశీర్వచనం పూర్తి చేశారేమిటి అని అర్చకులను ప్రశ్నించారు. ఆలయంలో గవర్నర్‌కు ఆశీర్వచనం జరిపేతీరు ఇదేనా? అంటూ ఆలయ అధికారులపై ఫైరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుని రాజ్‌భవన్‌కు వచ్చి కలవాలని ఆలయ ఈవో, వైటీడీఏ వైస్ చైర్మన్‌ను ఆదేశించారు.
అసలే కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన గవర్నర్. కేసీఆరే ఎప్పుడు వెళ్లినా గవర్నర్‌కు గౌరవంగా పాదనమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకుంటారని ప్రచారం ఉంది. ఇలాంటిది ఇప్పుడు గవర్నరే తమ మీద కన్నెర్ర చేయడంతో వారంతా వణికిపోతున్నారు. కానీ గవర్నర్‌పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఆయన గుళ్లూ.. గోపురాలతో టైం పాస్ చేయడమే కాదు.. అదేదో రాజ్యాంగంలో ఉన్నట్లుగా.. కచ్చితంగా అలాంటి ఆశీర్వాదాలు ప్రోటోకాల్‌గా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.