నూతన సంవత్సరం సందర్భంగా… ఏఎన్ఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్యూలో నరేంద్రమోడీ.. కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల గురించి తనకు ఏ మాత్రం తెలియదని ఒక్క ముక్కలో తేల్చేశారు. మోడీ నోటి వెంట వచ్చిన ఆ మాటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశం మొత్తం ఆసక్తి రేకెత్తించాయి. కేసీఆర్… ప్రత్యేక విమానాలేసుకుని… దిగ్గజాలు అనే నేతలందర్నీ కలిశారు. దానికి జాతీయ మీడియాలో విశేషం ప్రాధాన్యం కూడా లభించింది. ముఖ్యంగా.. రెండో గెలిచిన ఆయన ఒడిషా, బెంగాల్ వెళ్లారు. అవన్నీ.. జాతీయ మీడియాలోనూ హైలెట్ అయింది. న్యూస్ పేపర్లూ కవర్ చేశాయి. అయినా మోడీ తనకు తెలియదనే అన్నారు.
కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ప్రయత్నాలన్నీ బీజేపీ కోసమేనని.. విపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో… మోడీ .. ఇలా ఆ ఫ్రంట్ ఉనికిని ప్రశ్నించడం చాలా మందిని ఆశ్చర్య పరిచేదే. దానికి రెండు కారణాలు ఉన్నాయన్న విశ్లేషణ బీజేపీ వర్గాల నుంచి వస్తోంది. ఒకటి.. ఫ్రంట్ ఏర్పడే అవకాశం లేకపోవడం. కేసీఆర్ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా…ఎన్నికలకు ముందు ఎలాంటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే అవకాశం లేదు. ఆయన కలిసిన పార్టీల నేతలందరూ.. ఇప్పటికీ.. తమ తమ రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఓ ఫ్రంట్ పెట్టి.. ఆ ఫ్రంట్ బాటలో వెళ్లే అవకాశాలు అయితే లేవు. ఇక రెండోది.. ఒక వేల ఎవరైనా కేసీఆర్ .. బాటలో నడవాలని.. అనుకుంటే.. వారిపై బీజేపీ ముద్ర పడుతుంది. ఇప్పటికిప్పుడు బీజేపీతో లేని పార్టీలు ఎన్నికలకు ముందు తమపై బీజేపీ ముద్ర పడాలని కోరుకోవడం లేదు. ఈ కారణాల వల్లే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి తనకు తెలియని వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు.
అదే సమయంలో.. విపక్షాలన్నీ ఏకమవుతున్న పరిస్థితిని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మహాకూటమి అనేది దేశానికి ప్రమాదకరం అంటూ… మండి పడుతున్నారు. అలాంటి సమయంలో.. తాము స్వయంగా వేరే కూటమిని ప్రొత్సహిస్తున్నామని అంగీకరించడం లేదా… కూటమిని ఉనికిని గుర్తించడం .. విమర్శలకు కారణం అవుతుందన్న ఉద్దేశంతో మోడీ… కేసీఆర్ ఫీల్ అయినా సరే… ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలనేవి తనకు తెలియదని చెప్పిటన్లు తెలుస్తోంది. ఒక్కటి మాత్రం నిజం… ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం అనేది.. బహిరంగంగా జరిగింది. దానికి మీడియా ప్రచారం ఇచ్చింది. ఇంత జరిగిన తర్వాత మోడీ తెలియదు అని చెప్పారంటే.. అది రాజకీయ కారణమే తప్ప.. నిజంగా తెలియదంటే నమ్మడం కష్టమే…!