సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మురుగదాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మూడేళ్ల క్రితం మహేష్ బాబు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అంటూ ప్రచారం జరిగింది. ‘అనామిక’ తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన శేఖర్ కమ్ములకు మహేష్ అవకాశం ఇస్తాడా.. అయినా శేఖర్ కమ్ముల ఇప్పుడు హ్యాపీ డేస్ సినిమాను హిందీలో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు కదా.
ఇక వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే అనుకుంటున్నారంతా.. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం మురుగదాస్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాను మహేష్ ‘టక్కరిదొంగ’ సినిమా తీసిన జయంత్ సి పరాంజి నిర్మిస్తున్నాడట. టక్కరి దొంగ సినిమా తీసినప్పటి నుండి మహేష్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడట జయంత్. అందుకే ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నాడు.
కొంతకాలంగా కేవలం క్లాస్ కథలనే తీస్తున్న మహేష్ మరోసారి శేఖర్ కమ్ముల సినిమా అంటే అదే క్లాస్ సబ్జెక్ట్ తో సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా హ్యాపీడేస్ సినిమాతో కాలేజ్ డేస్ ను గుర్తుచేసేలా చేసి మధురానుభూతులను మిగిల్చిన శేఖర్ కమ్ముల మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అంటూ అభిమానులు ఊహించుకోవడం మొదలెట్టారు.