పెద్దనోట్లను ఎందుకు రద్దు చేశారనే ప్రశ్న వేస్తే.. కేంద్ర మంత్రివర్గంలో ఎంత మంది మంత్రులు ఉన్నారో.. అన్ని ఆన్సర్లు బయటకు వస్తాయి. అందులో మొదటిది బ్లాక్‌మనీని అరికట్టడం. ఇప్పుడు ఆ బ్లాక్‌మనీ గురించి మాట్లాడటం లేదు కానీ… మొదట్లో చెప్పింది ఇదే. పెద్ద నోట్ల వల్ల బ్లాక్‌మనీ బయటకు వస్తుందని.. ఇంకెవరూ పోగేసుకోలేరని చెప్పారు.. కానీ.. ఆ వెంటనే రూ. 2 వేల నోటు విడుదల చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి.. అంత కంటే పెద్ద నోట్లను తేవడం వల్ల… బ్లాక్‌మనీని ఎలా కంట్రోల్ చేస్తారో… సుప్రీంకోర్టులో లాయర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని… ఆర్థిక మంత్రిగా… చెలామణి అయిపోతున్న… అరుణ్ జైట్లీకి అప్పట్లో ఫుల్ క్లారిటీ ఉండేది. కానీ.. ఆ క్లారిటీ ఇంతా.. ఇప్పుడు మసక బారిపోయింది. రూ. 2వేల నోట్ల వల్ల… బ్లాక్ మనీ పెరిగిపోయి.. మనీ లాండరింగ్ విచ్చలవిడిగా జరిగిపోతోందని తెలిసొచ్చింది. అందుకే.. ఉన్న పళంగా.. రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేయాలని నిర్ణయించారట.
పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2వేల రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోదట. దీనిని ఆరికట్టేందుకు కేంద్రం 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసిందట. తాజా నిర్ణయంతో ముద్రణ ఆగిపోయినా కూడా రెండు వేల రూపాయల నోట్లు చెలామణీలోనే ఉండనున్నాయి. దేశంలో ప్రస్తుతం మొత్తం 18.03లక్షల కోట్ల రూపాయల డబ్బు చెలామణీలో ఉండగా, అందులో 37 శాతం అంటే 6.73లక్షల కోట్లు 2వేల రూపాయల నోట్లు ఉన్నాయి. వీటిలో బ్యాంకింగ్ రంగంలోకి రానివి.. యాభై శాతం వరకూ ఉన్నాయని.. అవన్నీ బ్లాక్ మనీ ఖాతాలోకి పోయాయని కేంద్రం ఇప్పటికి తెలుసుకుందట..!
రూ. 2వేల నోటు వల్ల… బ్లాక్ మనీ, మనీలాండరింగ్ భారీగా పెరుగుతాయని.. బీఏలో ఎకనమిక్స్ చదువుకున్న విద్యార్థి కూడా సులువుగా అంచనా వేస్తారు. కానీ.. కేంద్రం మాత్రమే.. దీని కోసం దాదాపుగా రెండేళ్లు సమయం తీసుకుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటోంది. దీని వెనుక కూడా రాజకీయ ప్రయోజనం ఉంది. ఎన్నికలకు ముందు.. తమకు కావాల్సిన నిధులను సమీకరించుకుని.. రూ. రెండు వేల నోట్లను.. నియంత్రిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా… రూ. 2వేల నోట్లను ప్రవేశ పెట్టే అంశంలోనూ.. వాటిని నియంత్రించే అంశంలోనూ… సాధారణ ప్రజలకు ఉపయోగడే అంశాలేమీ లేవు…! ఏదో పెద్ద గూడు పుఠాణి అయితే మాత్రం ఉందన్న అభిప్రాయం మాత్రం ఏర్పడక తప్పదు.