ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫెడరల్ ఫ్రంట్ గురించి అసలు తెలియనే తెలియదని.. దాని గురించి విననే లేదని .. తేల్చి చెప్పారు. ఆయన నేతృత్వంలోనే ఫెడరల్ ఫ్రంట్‌కు రూపకల్పన జరుగుతోందని… ఆయన అబద్దాలు చెబుతున్నారని… విపక్ష పార్టీలు మాట్లాడాయి కానీ.. కేసీఆర్ కానీ.. టీఆర్ఎస్ నేతలు.. కానీ ప్రధాని వ్యాఖ్యలపై ఒక్క మాట కూడా స్పందించలేదు. ఫెడరల్ ఫ్రంట్‌కు ఢిల్లీలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఎంపీ వినోద్ కుమార్… కూడా.. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించడానికి తటపటాయిస్తున్నారు. మామూలుగా అయితే.. ఫెడరల్ ఫ్రంట్‌పై … చంద్రబాబు లాంటి నేతలు.. ఏదైనా విమర్శ చేస్తే.. వినోద్ కుమార్ ముందుగా మీడియా ముందుకు వచ్చి విరుచుకుపడతారు. అలాంటిది.. అసలు ఫెడరల్ ఫ్రంట్ ఉనికినే గుర్తించనట్లుగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలపై ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నట్లు..?
రైతుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని.. రైతు బంధు లాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా తగ్గించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి సేకరించింది. అంతే.. టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ సహా.. అందరూ.. కేంద్ర ప్రభుత్వానికి తమ పథకాలే ఆదర్శమని… తమను తాము పొగుడుకోవడం ప్రారంభించారు. మరి కేంద్రం అలా చేసినప్పుడు పొగుడుకుని… కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫెడరల్ ఫ్రంట్‌ను… మోడీ చాలా తేలిగ్గా తీసి పడేసినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు..? మోడీ వ్యాఖ్యలపై తమ అభిప్రాయం ఎందుకుచెప్పడం లేదు…?
నిజానికి కేసీఆర్ .. “దేశ్ కీ నేత”గా మారడానికి ఫెడరల్ ఫ్రంట్‌ను ఓ అస్త్రంగా చేసుకున్నారు. రైతు బంధు పథకం ప్రారంభోత్సవ సమయంలోనే… దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. హిందీ టీవీ చానళ్లలోనూ ప్రకటనలు ఇచ్చారు. తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే సమయంలోనే… ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేసి.. ఓ విడత పర్యటనలు పూర్తి చేశారు. రెండో సారి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది నిజంగా దేశ రాజకీయాల్లో కీలక పరిణామమే. అది ప్రధానికి తెలియకుండా ఉంటుందని ఎవరూ అనుకోరు. అయినా.. ప్రధాని మరీ అంత తేలిగ్గా.. ఫెడరల్ ఫ్రంట్‌ను తీసేస్తే.. టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదు..?