ఆ హీరోయినేమో.. పదుల సంఖ్యలో సినిమాలు చేసేసింది. హీరో లందరితోనూ ఓ రౌండ్ వేసేసింది. వెటరన్ జాబితాలోనూ చేరిపోయింది. ఇక ఆమెకు అవకాశాలు రావు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కి వరుసగా సినిమాలు చేస్తోంది. ఓ హీరోతో అయితే వరుసగా రెండో సినిమా ఒప్పుకుంది. రెండు సినిమాలు కదా.. అందుకే ఇద్దరి మధ్య రాపో బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సదరు యంగ్ హీరో… ఈ కథానాయిక ట్రాప్లో పడిపోయాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ కథానాయిక కోసం హీరోగారు భారీగా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఇద్దరిలో ఎవరి పుట్టిన రోజు వచ్చినా.. పార్టీ ఇచ్చేది హీరో గారే. కానుకలు పంచేదీ ఆయనే. హైదరాబాద్ లో ఆ కథానాయిక ఉన్నంత కాలం… ఖర్చులన్నీ హీరోగారివేనట. ఈ విషయం హీరో తండ్రికి కూడా తెలిసిపోయింది. ఓ అమ్మాయి కోసం విచ్చల విడిగా ఖర్చు పెడతావా? అంటూ ఆయన కూడా క్లాసు తీసుకున్నట్టు ఇన్ సైడ్ వర్గాల ద్వారా తెలిసింది. కానీ కుర్రాడు కదా, పైగా ఉడుకు రక్తం.. తండ్రి చెబుతున్నా, స్నేహితులు వారిస్తున్నా… పట్టించుకోవడం లేదట. మరి ఈ అనుబంధం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.