కల్యాణ్ సుంకర… ఈ పేరు బహుశా చాలామందికి తెలీక పోవచ్చు. కానీ సినిమా పరిశ్రమ వాళ్లకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే.. ఆయన ప్రముఖ టాలీవుడ్ మేనేజర్. కొంతమంది హీరోయిన్ల డేట్లు చూస్తుంటాడు. హీరోలు, దర్శకులు.. కల్యాణ్‌కి బాగా టచ్చు. ఈయన ఇటీవల అరెస్ట్ అయినట్టు, ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబరు 31 రాత్రి… హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ని నిర్వహించాడు ఈ మేనేజర్. ఈ పార్టీకి హీరోయిన్లు కూడా వస్తారని ప్రచారం చేసి, టికెట్లు బాగా అమ్ముకున్నాడు. తీరా చూస్తే.. హీరోయిన్లెవరూ రాలేదు. ఆకార్యక్రమం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో… కొంతమంది కల్యాణ్ సుంకర పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు పార్టీలో.. హీరోయిన్లు డాన్స్ చేస్తారని, పార్టీకి వచ్చిన వాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవుతారని ప్రచారం చేసినట్టు, అవన్నీ ఉంటాయని ఆశపడి వెళ్లిన వాళ్లు.. అసలు పార్టీలో హీరోయిన్లే కనిపించకపోయేసరికి… సుంకరపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తేలింది. జనవరి 1వ తారీఖునే కల్యాణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఇప్పుడు రిమాండ్ నిమిత్తం జైలుకి తరలించినట్టు తెలుస్తోంది.