ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభజన హామీల విషయంలో… బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క టీడీపీ మాత్రమే గళమెత్తుతోంది. మిగతా పార్టీలను నయానో..భయానో నోరు మెదపకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా… టీడీపీని కంట్రోల్లో ఉంచడానికి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ఏపీలో .. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. తనపై హత్యాయత్నం చేయడానికే.. టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి వచ్చారని.. కన్నా ఆరోపించడంతోనే.. బీజేపీ ఉద్దేశం బయటపడిపోయిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ పథకం ప్రకారమే.. కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ మహిళా నేను ముందు పెట్టారు. చంద్రబాబు .. ఆగ్రహాన్ని ఆపుకోలేదు. హోదా కోసం గొంతెత్తిన వారిని ఢిల్లీలో లాఠీఛార్జీ చేస్తే మీరెందుకు మాట్లాడలేదని నిలదీశారు. పుట్టిన గడ్డపై మీకు మమకారం లేదా అని ప్రశ్నించారు…ఆ సందర్భంలో ఫనిష్ అనే పదం వాడారు. అంతే్.. దాన్ని పట్టుకుని.. బీజేపీ నేతలు రెచ్చిపోయారు. ఏపీ హామీల గురించి వారికేమీ పట్టింపు లేదు. వారికి కావాల్సింది కూడా అదే. విభజన సమస్యలు పక్కకు పోయి ఉద్రిక్తతలు ముందుకు వచ్చాయి. కన్నా ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగి.. ప్రతి దాడులు జరిగితే.. మరింత రచ్చే చేసే ప్లాన్ చేశారు. కానీ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
విభజన హామీలు.. బీజేపీకి ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రజల్లో జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేలా బీజేపీ వ్యూహం ప్రకారమే… టీడీపీపై ఉద్రిక్తతలు సృష్టించేలా ప్లాన్ చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడం, అవినీతి ఆరోపణలు చేయడం , ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా సెంటిమెంట్ ను అధిగమించేందుకు బిజెపి వ్యూహాత్మంగా పావులు కదుపుతుంది. గమనించిన తెలుగుదేశం కేంద్రంపై పోరాటం చేస్తూ సెంటిమెంట్ ను మరింత రగిల్చేందుకు ప్రతివ్యూహం రూపొందించింది. దీనిపై వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు… బీజేపీ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలకు ప్రయత్నించి వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం ఏర్పడింది. ఓ రకంగా బీజేపీ ట్రాప్‌లో పడిందని చెబుతున్నారు. దీన్ని టీడీపీ అధినేత కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.