‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్నప్పుడే ‘ఏఎన్నార్’ బయోపిక్ సంగతేంటన్న టాపిక్ వచ్చింది. ఈ విషయమై నాగార్జున కూడా స్పందించాడు. ‘నాన్నగారి జీవితంలో మరీ సినిమాటిక్ మలుపులేం ఉండవు. బయోపిక్‌కి సరితూగదు’ అని తేల్చేశాడు. కాకపోతే…ఈమధ్య బయోపిక్‌ల హవా ఎక్కువైంది. దాంతో పాటు.. కమర్షియల్గానూ బాగా వర్కవుట్ అవుతున్నాయి. నాగేశ్వరరావు పాత్రని ఎవరు చేస్తారు? అని అడిగితే… సుమంత్, నాగచైతన్యలు ఎదురుగా కనిపిస్తున్నారు. అందుకే బయోపిక్ విషయంలో నాగ్ పునరాలోచించుకునే ఛాన్సుంది. ఒకవేళ నాగ్ కాకపోయినా.. మరో నిర్మాత ఎవరైనా సరే… ఏఎన్నార్ బయోపిక్‌ని నెత్తిమీద వేసుకునే అవకాశాల్నీ కొట్టి పారేయలేం.
‘అక్కినేని బయోపిక్ తీస్తానంటే నటించడానికి మీరు సిద్ధమేనా’ అని సుమంత్‌ని అడిగితే…. ”తాతగారి బయోపిక్‌పై నిర్ణయం నాగార్జున మావయ్యదే. ఆయన ఏం చెబితే అది చేస్తాం. ఇప్పుడు ఇంటికి పెద్ద ఆయనే కాబట్టి.. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత మాపై ఉంది. ఇప్పటి వరకూ మా మధ్య తాతగారి బయోపిక్ గురించిన టాపిక్ రాలేదు” అని క్లారిటీగా చెప్పేశాడు. సో.. నాగ్ ఓకే అనుకుంటే మాత్రం ఏఎన్నార్ బయోపిక్‌కి అవకాశాలున్నాయన్నమాట. ‘మనం’ సినిమాతో నాన్నకి ఓ గొప్ప వీడ్కోలు పలికిన నాగ్… బయోపిక్ తీస్తే… అది మరో చరిత్ర అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.