బయోపిక్‌ల పరంపరలో తెరకెక్కుతున్న మరో చిత్రం `యాత్ర`. అలనాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కథ ఇది. ఆయన చేసిన పాద యాత్ర అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజకీయంలో అదో కొత్త అధ్యాయనం. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి రావడానికి వై.ఎస్.ఆర్ చేసిన పాద యాత్ర బాగా దోహదపడింది. ఇప్పుడు ఆ ఇతివృత్తాన్నే ‘యాత్ర’లో చూపించబోతున్నారు. వైఎస్ఆర్గా మమ్ముట్టి నటించిన ఈ చిత్రానికి మహి రాఘవ దర్శకుడు. ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. పాద యాత్ర అనుభవాలే ట్రైలర్లోనూ కనిపించాయి. వై.ఎస్ ప్రయాణంలో ఎదురైన మనుషులు, అధిష్టానం నుంచి ఎలంటి ఒత్తిళ్లు ఎదుర్కున్నారు?, ఇచ్చిన మాట కోసం ఎలాంటి సాహసాలు చేశారు..? ఇవన్నీ తెరపై చూపించే ప్రయత్నం చేశారు. మమ్మట్టి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. వై.ఎస్ గొంతులోని గాంభీర్యం మమ్ముట్టి గొంతులోనూ వినిపించింది. వైఎస్ హావభావాల్ని బాగా వంటబట్టించుకున్న మమ్మట్టి… ఆ పాత్రలో ఒదిగిపోయారు. నేపథ్య సంగీతం, విజువల్స్. వైఎస్సార్..వైఎస్సార్ అనే పిలుపులు.. ఇవన్నీ ఓరకమైన మూడ్‌ని క్రియేట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందొచ్చే ఈ సినిమా వైకాపాకి కావల్సినంత బూస్ట్ ఇస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు.