బోయపాటి శ్రీను సినిమాలంటే యాక్షన్ ప్రియులకు పండగే. ఫైట్ సీక్వెన్స్‌ని తీర్చిదిద్దడంలో బోయపాటి శైలే వేరు. `ఇప్పుడు హీరో విలన్ని కొట్టాలి… ` అని ప్రేక్షకులే గట్టిగా కోరుకునే వరకూ సీన్‌ని తీసుకెళ్లి.. అక్కడో భారీ ఫైట్ వదలడం బోయపాటి స్టైల్. `వినయ విధేయ రామ`లోనూ అదే ఫాలో అయ్యాడు బోయపాటి. ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంది. ఓ ఫైట్ అయితే.. అజయ్ బయ్జాన్ అనే ఓ కొత్త దేశంలో షూట్ చేశాడు. చరణ్ మిషన్ గన్ పట్టుకుని.. శత్రు సంహారం చేస్తున్న స్టిల్ ఉంది కదా? అది.. అక్కడ తీసినదే. ఈ ఫైట్ కోసం ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ప్రీ క్లైమాక్స్ లో ఈ ఫైట్ రాబోతోంది. ఈ ఫైట్ కోసం రష్యన్ ఫైటర్లని తీసుకొచ్చాడు బోయపాటి. వాళ్ల రోజువారీ జీతభత్యాలే లక్షల్లో ఉంటాయని టాక్. మిగిలిన పోరాట ఘట్టాలకూ భారీగానే ఖర్చు పెట్టారు. మొత్తానికి బోయపాటి కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. దానికి తగినట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజులో సాగింది. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో పూర్తి మాస్, యాక్షన్ సినిమా ఇదే. ఆ ఒక్క పాయింటూ.. వి.వి.రా కి బాగా కలిసొస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.