సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సీబీఐ డైరక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను రాత్రికి రాత్రి బలవంతంగా సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని… సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అలా పంపే అధికారం.. సీవీసీ, ప్రధాని నేతృత్వంలోని నియామకాల కమిటీకి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ రాజ్యాంగపరంగా.. స్వతంత్రంగా ఉన్న సంస్థ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం… సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వివాదం ఏర్పడింది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అలోక్ వర్మను ఇరికించడానికి రాకేష్ ఆస్థానా ఏకంగా దొంగ స్టేట్‌మెంట్లు తయారు చేసినట్లు తేలింది. దీంతో.. ప్రధానమంత్రి జోక్యం చేసుకుని… అర్థరాత్రి సమయంలో.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించి… అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను బలవంతపు సెలవుపై పంపించారు. మన్నెం నాగేశ్వరరావును సీబీఐ ఇన్చార్జ్ డైరక్టర్‌గా నియమించారు. ఈ నిర్ణయం చెల్లదంటూ… అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలోక్ వర్మను సెలవుపై పంపే విషయంలో కేంద్రం… నిబంధనలను పాటించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సీబీఐ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. భారతీయ జనతా పార్టీ నేతలు పూర్తిగా తమ రాజకీయ శత్రువులను టార్గెట్ చేసుకోవడానికి సీబీఐని ఓ అస్త్రంగా వాడుకుంటున్నారని.. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సమయంలో… అలోక్, రాకేష్‌ల వ్యవహారంల కలకలం రేపింది. రాఫెల్ స్కాంపై… సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మకు…మాజీ బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌలిఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు.. అలోక్ వర్మ విచారణ ప్రారంభించబోతున్నారన్న కారణంగానే.. కేంద్రం అలోక్ వర్మను తప్పించిందని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే సుప్రీంకోర్టు విచారణలో చాలా కీలకమైన విషయాలు బయట కుచ్చాయి. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ చేసిన కేసుల ప్రయోగాల గురించీ వెలుగులోకి వచ్చింది. ఓ సందర్భంలో.. కోర్టు విచారణలో ఉన్న అంశాలను బయటకు రావడం పై… సుప్రీంకోర్టు కూడా.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలోక్ వర్మను.. సెలవులో పంపడం కుదరదన్న సుప్రీంకోర్టు అక్టోబర్ 23న కేంద్రం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది. ఇప్పుడు సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మే కొనసాగుతారు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని… సుప్రీంకోర్టు అలోక్ వర్మపై ఆంక్షలు విధించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో… సీబీఐ కేంద్రంగా మరింత రాజకీయం రాజుకునే అవకాశం కనిపిస్తోంది.