చిరంజీవి ‘సైరా’ ఈ వేసవిలో విడుదల కావాల్సింది. కానీ… అది సాధ్యం కావడం లేదు. ఈ సినిమా ఎక్కువగా రీషూట్లు జరుపుకుంటోందని, అందుకే… విడుదల ఆలస్యం అవుతోందని వార్తలొస్తున్నాయి. వీటిపై రామ్చరణ్ స్పందించాడు. రీషూట్లలో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. ‘రీషూట్లు చేసేంత డబ్బు మా దగ్గర లేదు` అంటూ.. లైట్ గా తీసుకున్నాడు. అయితే ‘సైరా’ షూటింగ్ అంతా సవ్యంగా, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతోందని తాను చెప్పడం లేదని, పెద్ద పెద్ద సినిమాలకు కొన్ని సమస్యలు తప్పవని, షెడ్యూల్ అనుకున్న ప్రకారం పూర్తవ్వవని చెప్పుకొచ్చాడు చరణ్. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడిగితే… “ఇప్పటికైతే రూ.200 కోట్లు అనుకుంటున్నాం. ఈ సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్లాలని, పాన్ ఇండియా గుర్తింపు సంపాదించాలి అనే దానిపైకంటే… సౌత్ ఇండియాలో బాగా ప్రమోట్ చేయాలనే విషయంపైనే దృష్టి పెట్టాం. బహుశా.. దసరాకి ఈ సినిమా విడుదల కావొచ్చు” అంటూ ‘సైరా’ సంగతుల్ని బయటపెట్టాడు చరణఖ్.