హేరిటెజ్ పాలు లీటర్ రూ. 80కు అమ్ముకుంటారా..?
రు. ఆరున్నర లక్షల కోట్ల అవినీతి సాధ్యమేనా..?
ఆరు వేల ప్రభుత్వ స్కూళ్లు మూసేశారా..?
ఇవన్నీ అతిశయోక్తులతో కూడిన ఆశ్చర్యకరమైన విషయాలు. జగన్ ప్రసంగాల్లో ఇవన్నీ చాలా అసువుగా దొర్లేస్తూ ఉంటాయి. పక్కనున్న ప్రజలకు నిజాలు తెలిసినా.. ఆయన తను చెప్పేదే నిజం అని ఢంకా బజాయించి చెబుతారు. ఏ మాత్రం సిగ్గుపడరు. ఆలోచించరు. హెరిటేజ్ పాలు బయట ఎంత అమ్ముతున్నారో పాల ప్యాకెట్లు కొనేవాళ్లకు తెలియదా..? రూ. 80కి అమ్ముకుంటే.. ఎవరైనా కొంటారా..? పోనీ బలవంతంగా కొనిపిస్తున్నారా..? .. అదేమీ లేదు.. చంద్రబాబు ఏదో చేస్తున్నారన్న భ్రమలు కల్పించడానికి… ఐదు పైసల విషయాన్ని రూపాయిగా చూపించే ప్రయత్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఎక్కువగా.. అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టడం పుస్తకాలు వేయడం దగ్గర్నుంచి.. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఏపీలో ఏ ఒక్కరూ కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారన్న బావన కల్పించడానికి ప్రయత్నం చేయడం వరకూ ఉంది.
ఇప్పుడు ఏదో ప్రజలంతా తీవ్రమైన కష్టాల్లో ఉన్నట్లు భ్రమింప చేయాడనికి .. లేని పోని అతిశయోక్తులు చెప్పి… జగన్ అన్న వస్తే తమ కష్టాలు తీరిపోతాయని ప్రజలు భావిస్తున్నట్లుగా.. తనకు తానే చెప్పుకోవడానికి జగన్ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఓ శివన్న దగ్గర్నుంచి.. మరో నారాయణరెడ్డి వరకూ… అనేక మంది తనకు చెప్పారంటూ.. అనేక పిట్టకథలు చెప్పుకొచ్చారు. అవన్ని సాక్షిలో వచ్చిన కథలే. వాటిని చెప్పి.. అవన్నీ ప్రజలు పడుతున్న బాధలంటూ.. ఆవేదన చెందే ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ కథలేనని వినేవాళ్లకూ స్పష్టంగా తెలుసు.
జగన్ ప్రసంగంలో.. ఏ ఒక్కటి వాస్తవానికి దగ్గరగా లేదనేది సామాన్యుల అభిప్రాయం. చంద్రబాబు పాలనపై.. తన వ్యతిరేకతనంతా… ఎక్స్ట్రా లార్జ్గా వ్యక్తం చేశారు కానీ… తను వస్తే.. ఆ కష్టాలను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. కానీ.. ఉచిత హామీల వరద పారించారు. రూ. 12500 ప్రతి రైతుకు మేలో ఇస్తామని ప్రకటించారు. అది ఎకరాకా.. లేక… రైతుల లెక్కనా అన్నది క్లారిటీలేదు. ఉచిత బోర్లు, వడ్డీ లేని రుణాలు అంటూ హోరెత్తించారు. జగన్ ఇచ్చిన హామీలు కూడా ఎక్స్ట్రా లార్జ్ పద్దతిలోనే ఉన్నాయన్నది సామాన్యుల అభిప్రాయం. సాధారణంగా గెలుపుపై అపనమ్మకం ఏర్పడినప్పుడు… ఉచిత హామీల వరద పారిస్తారు. జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది.