ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును… ఉభయ సభలు ఆమోదించాయి. అయితే… పార్లమెంట్ ఆమోదించిన న్యాయసమీక్ష ముందు … ఈ బిల్లు నిలబడదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలన్నీ వ్యక్తం చేశాయి. కానీ పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకిస్తే.. పేదలను వ్యతిరేకించినట్లవుతుందనే అంచనాతో బిల్లుకు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆ బిల్లును చట్టంగా పరిగణనించకూడదంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్చంద సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది. 1992 సుప్రీంకోర్టుకు విరుద్ధంగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని.. సంస్థ తన పిటిషన్ లో పేర్కొంది.
న్యాయ సమీక్షకు రాకుండా ఉంటే.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని.. కొంత మంది సభ్యులు… చర్చ సందర్భంగా.. ప్రభుత్వానికి సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం.. ఈ విషయంలో తన స్పందన వ్యక్తం చేయలేదు. తన వాదన తాను వినిపించింది. సుప్రీంకోర్టు గతంలో విధించిన యాభై శాతం కోటా కిందకు… ఈ బిల్లు రాదని.. అవి సామాజిక వర్గాల ప్రకారం రిజర్వేషన్లు అని.. ఇప్పుడు ఇస్తున్నది.. ఆర్థిక వెనుకబాటు కారణంగా ఇస్తున్న రిజర్వేషన్లు అని వాదించింది. ఇక్కడే కొంత మంది సభ్యులు కొన్ని కీలక సందేహాలు తలెత్తారు. రాజ్యాంగంలో… అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేవని చెబుతున్నారు.
సాధారణం గా కోర్టు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉండే బిల్లలను అంగీకరించదు. గతంలో పీవీ నరసింహారావు హయాంలో.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు… సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. న్యాయపరమైన అడ్డంకులు అధిగమిస్తేనే బిల్లు.. అమల్లోకి వస్తుంది.