సాక్షి పత్రిక కోసం.. షర్మిలను ఇంటర్యూ చేసిన జర్నలిస్ట్ ను జగన్ ఉద్యోగం నుంచి తొలగించారా..? సీనియర్ అయిన జ్యోతుల నెహ్రూను. జగన్ తన పక్కన కూర్చోవద్దని ఆదేశించారా..? దాడి వీరభద్రరావు కూడా సార్ అని పిలిస్తేనే పార్టీలో ఉండమన్నారా..? .. అవుననే అంటున్నారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు.. పాదయాత్ర ముగింపు సందర్భంగా… తమపై.. తెలుగుదేశం పార్టీపై చేసిన విమర్శలను తిప్పికొడుతూ.. అందరూ కలిసి ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో పది ప్రశ్నలు సంధించారు. సైకో మనస్థత్వంతో కనీస మానవత్వం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని.. చెబుతూ… ఇలాంటి ఘటనలన్నింటినీ లేఖలో వివరించారు. జగన్ సీఎం కుర్చీ కోసం మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మండిపడ్డారు.
జగన్ ఓ అవినీతి చక్రవర్తి అని .. అభివృద్ది చక్రవర్తి చంద్రబాబు అని… ఎమ్మెల్యేలు లేఖలో ప్రొన్నారు. రూ.43వేల కోట్ల అవినీతి కేసులో జగన్ ఏ-1 ముద్దాయిగా ఉన్నారని, జగన్ దుష్ట రాజకీయాలు భరించలేకే తాము వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. బెయిల్ కోసం సోనియాగాంధీకి, తెలంగాణలో కాంట్రాక్టుల కోసం కేసీఆర్కు, కేసుల మాఫీ కోసం మోదీకి.. వైఎస్ జగన్ అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలుపాలయ్యారని మంత్రులు విమర్శించారు. నలుగురు సభ్యులు ఉండే జగన్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా రూ.లక్షల జీతాలు తీసుకోవడం ప్రజాద్రోహం కాదా? పాదయాత్రలో ఒక్కసారైనా ప్రధాని మోదీని విమర్శించారా? అని మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖలో.. జగన్ లేఖలో నిల దీశారు.
జగన్ ఓ సైకో… మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. 12 చార్జిషీట్లలో ఏ-1 ముద్దాయిగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పాదయాత్రలో ఒక్కసారైనా మోదీ చేసిన ద్రోహంపై మాట్లాడలేదని పాదయాత్రలో ఎన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి నిరోధకుడు జగన్ అని మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శించారు. జగన్ కు సంధించిన పది ప్రశ్నలు ఆయన విపరీత మనస్థత్వాన్ని ఫోకస్ చేసేవిగా ఉన్నాయి.