తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… జాతీయ రాజకీయాల్లో క్లిక్ కాలేకపోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో.. ఓ కూటమిని ఏర్పాటు చేద్దామంటే.. కలసి నడిచేందుకు ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. అందుకే… కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల మనసు మార్చి.. అందరూ ఫెడరల్ ఫ్రంట్ వైపు వచ్చి.. ఫెడరల్ ఫ్రంట్ భారీ సక్సెస్ అయ్యాలా.. కేసీఆర్ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. అది ఆయనకు బాగా అచ్చి వచ్చిన ప్రయత్నం. ఏ లక్ష్యం కోసం యాగం చేసినా… ఎప్పుడూ సక్సెస్ అయ్యే ప్రయత్నం.. అదే యాగం. ప్రస్తుతం కేసీఆర్… ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. దానికి కారణంగా.. ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ లక్ష్యంగా చేయబోతున్న యాగయమే.
ప్రస్తుతం … కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. భారీ యాగం కోసం.. ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బయట నుంచి చూసేవారికి లోపల ఏం జరుగుతుందో అర్థం కాదు… కానీ.. లోపల మాత్రం..ఓ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ” చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం” కోసం అని… కేసీఆర్ అత్యంత సన్నిహితుల ద్వారా బయటకు వెల్లడయింది. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ఈ యాగాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి కేసీఆర్ ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ యాగం జరగనుంది.
200మంది రుత్విక్కులు పాల్గొనే ఈ యాగ క్రతువును చూసేందుకు ప్రజలకు అనుమతించాలా వద్దా అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ తను చేపట్టబోయే ఏ పని ముందు అయినా.. దానిక సంబంధించిన యాగం నిర్వహిస్తారు. అది చాల కాలం నుంచి వస్తోంది. గత ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించే ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. అధికారం అందుకున్నారు. తన యాగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కేసీఆర్ కు నమ్మకం అందుకే… ఈ సారి ” చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం” ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను విజయవంతంగా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.