వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఆ పార్టీ పత్రిక సాక్షికి… చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అంతు పట్టడం లేదు. ఇలా చెప్పడం కన్నా… అసలు.. ఏ పార్టీతో.. చంద్రబాబును అంట కట్టాలో.. వారిలో వారికే క్లారిటీ రావడం లేదు. అందుకే.. అటు కాంగ్రెస్‌తోనూ.. ఇటు బీజేపీతోనూ ఉన్నట్లు రాసుకొస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. కొద్ది రోజులుగా.. బీజేపీ హైకమాండ్‌పై… పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. దీనంతటికి కారణం ఆరెస్సెస్ ఉన్నత వర్గాలు మోడీపై కోపంగా ఉండటమేనని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. సాక్షికి.. మాత్రం ఇందులో చంద్రబాబు కనిపిస్తున్నారు. చంద్రబాబు వల్లే .. నితిన్ గడ్కరీ… మోడీపై… విమర్శలు చేస్తున్నారట. ఈ మేరకు ఆరెస్సెస్ కు చంద్రబాబు డైరక్షన్ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ… బీజేపీకి కటిఫ్ చెప్పిన తర్వాత చంద్రబాబును.. బీజేపీతోనే అంట కట్టేందుకు సాక్షి చాలా రకాలుగా ప్రయత్నించింది. అటు కాంగ్రెస్‌తో ఇటు బీజేపీతో… కలిపి చాలా కథనాలు ప్రసారం చేసింది. కానీ.. అలాంటి కథనాలు ప్రజల్లో కానీ.. పాఠకుల్లో కాని క్రెడిబులిటి రాలేదు. కానీ సాక్షి మాత్రం తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. కొత్తగా చంద్రబాబు.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని.. జాతీయ స్థాయిలో మాత్రం అవగాహన ఉంటుందని… సంకేతాలిస్తున్నారు. దీంతో… మరో సారి సాక్షి పత్రిక తన జర్నలిజ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆయన ఆరెస్సెస్ నేతలతో సమావేశమయ్యారమని.. రామ్‌దేవ్ బాబా మధ్యవర్తిత్వం రాసేశారని కథనం అల్లుకొచ్చారు. కానీ అందులో లాజిక్కులు కానీ మ్యాజిక్కులు కానీ ఏమీ లేవు.
మోడీని తీసేస్తే.. మళ్లీ బీజేపీకి మద్దతిస్తామనే.. ప్రతిపాదన ఆరెస్సెస్ ముందు పెట్టారట. దానికి ఆరెస్సెస్.. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేతలకు చెప్పిందట. ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటారు..? ఇప్పుడు అసలు బీజేపీతోనే… టీడీపీకి ఎలాంటి సంబంధాలు లేనప్పుడు.. బీజేపీ నేతలు ఎలా జాగ్రత్తగా ఉండాలి.. ఆరెస్సెస్ చెబుతుందో.. మరి..? అలా చెప్పినట్లయితే.. గడ్కరీకి మోడీపై తిరుగుబాటు చేసే అవకాశం ఎందుకిస్తారు..? సాక్షి పత్రిక తన యజమాని రాజకీయ ప్రయోజనాల కోసం… ఎంతకైనా దిగజారి… ఊహాగానాలు ప్రచారం చేస్తోందని… ఈ కథనం చదవిన జగన్‌కైనా అర్థం అయిపోతుంది. మరి సాధారణ పాఠకులకు అర్థం కాదా..?