ఎక్కడైనా నేరం జరిగితే ఎవరైనా ఏం చేస్తారు..? ముందు బాధితుడు దగ్గర వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తారు..?. మరి విశాఖ కోడి కత్తి కేసులో… ఎన్ఐఏ విచారణ ప్రారంభించి ఏం చేస్తోంది..? ఏదో షో చేయడానికి అన్నట్లుగా కోర్టు ద్వారా నిందితుడ్ని కస్టడీకి తీసుకుని విశాఖ, హైదరాబాద్, చెన్నై అంటూ తిప్పుతోంది. రీ కన్ స్ట్రక్షన్ పేరుతో.. ఎయిర్ పోర్టులో సీన్ క్రియేట్ చేస్తోంది. అసలు.. ఏం జరిగిందో.. బాధితుడైన జగన్మోహన్ రెడ్డిని కలిసి తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు. ఏపీ పోలీసులకు సహకరించడానికి.. జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. ఆయన స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అంటే… ఈ కేసులోఇంత వరకూ పోలీసుల దగ్గర బాధితుడి స్టేట్ మెంట్ లేనే లేదు. అలాంటి సమయంలో.. కేసును చేతుల్లోకి తీసుకున్న ఎన్ఐఏ .. జగన్ వాంగ్మూలాన్ని తీసుకునే ఆలోచన మొట్టమొదట చేయాలి. కానీ ఎందుకు చేయడం లేదు..?
ఏ కేసులో అయినా బాధితుడు చెప్పే వివరాలు కీలకం. ఆయన దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు సేకరించడం అంతే అవసరం. ముందాగా బాధితుడ్ని వివరాలు తీసుకుని ఆ తర్వాత లభించే సాక్ష్యాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లడం అనేది… పోలీసు విచారణ ప్రక్రియలో కీలకం. అసలు ఎన్ ఐ ఏ … జగన్ ను ప్రశ్నించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకండా.. నిందితుడైన శ్రీనివాసరావును… మాత్రం ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి… తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు కూడా చేయలేదు. ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి.. విచారణ చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో జగన్ ను ప్రశ్నించాల్సిన అవసరమే ఎక్కువగా ఉందని.. పోలీసు వర్గాల అంచనా. జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినప్పుడు… ఏం జరిగింది..? పెద్ద గాయం అయితే.. హైదరారాబాద్ ఎందుకెళ్లారు..? గాయంతో ఉన్న వారిని… విమానాల్లో ఎక్కనీయరు … ఎలా ప్రయాణించేలా అంగీకరించారు..? దాడి చేసిన కత్తిని వైసీపీ నేతలు ఎందుకు బయటకు తీసుకెళ్లారు..? క్లీన్ చేసి ఎందుకు తీసుకువచ్చారు..? ఇది సాక్ష్యాలను ధ్వంసం చేయడం కాదా..? ఇలాంటి వాటిపై…. ఎన్ఐఏ విచారణ చేయాల్సి ఉంది.. కానీ.. ఉగ్రవాద వ్యవహారాల దర్యాప్తులు చూసే.. ఎన్ఐఏ కి ఇదేమీ తెలిసినట్లు లేదనే విమర్శలు వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి.. విచారణకు సహకరిస్తారా లేదా.. అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన మైండ్ సెట్ గురించి తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు… ఆయన చెబుతున్న వాదనకు.. అంటే చంద్రబాబుపై ఎన్ఐఏ ఏదో విధంగా అనుమానాలు వ్యక్తం చేసేలా మీడియాకు లీకులు ఇవ్వడమో… మరొకటో చేస్తేనే ఎన్ఐఏకు జగన్ సహకరిస్తారని చెబుతున్నారు. లేకపోతే… ఎన్ఐఏపైనా… విమర్శలు చేయడం ఖాయమని అంటున్నారు. ఈ రెండింటిలో.. ఏదో ఒకటి అతి త్వరలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు. మరి ఏది జరుగుతుందో.. వేచి చూడాలి..!