ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ప్రతీ ఏడాది ఓ పెద్ద బృందంతో… దావోస్ వెళ్తారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు. అక్కడ ప్రత్యేకంగా సన్ రైజ్ స్టేట్ ఏపీ పేరుతో… స్టాల్ ఏర్పాటు చేస్తారు. కానీ.. ఈ సారి ఎన్నికల వేడి పెరిగిపోయింది. రోజు రోజుకు రాజకీయాలు మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారం రోజుల పాటు… రాష్ట్రానికి దూరంగా ఉండటం.. పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని.. సీనియర్ నేతలు సూచించడంతో.. ఆయన ఆగిపోయారు. అయితే.. లోక్ సహా మిగిలిన బృందం దావోస్ వెళ్లే అవకాశం ఉంది.
19వ తేదీన కోల్ కతాలో… విపక్ష పార్టీల మహా ర్యాలీ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ… చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు కూడా కీలకం. మమతా బెనర్జీని టీఎంసీ…. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుంది. బెంగాల్ లో కాంగ్రెస్ తో పొత్తు కూడా పెట్టుకోవడం లేదు. ఈ కారణంగా.. రాహుల్ గాంధీ.. ఈ ర్యాలీకి వెళ్లడం లేదు. అదే సమయంలో… బెంగాల్ లో మమతా బెనర్జీతో పోరాడుతున్న వామపక్షాలు కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలకం. వారు కూడా ఈ ర్యాలీకి హాజరయ్యే పరిస్థితి లేదు. ఇలాంటిసమస్యలను చక్కదిద్ది.. వీలైనంత వరకూ.. విపక్ష పార్టీలను.. ఆ ర్యాలీకి హాజరయ్యేలా చూడాలని… చంద్రబాబు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. రాజకీయాల్ని వారం రోజుల పాటు పూర్తిగా పక్కన పెట్టాలని అనుకోవడం లేదు.
అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా.. మధ్యలో ఉంది. జిల్లాల వారీగా.. ఇప్పటికీ… తేల్చాల్సిన చిక్కుముళ్లు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. బలమైన అభ్యర్థులు పోటీ పడుతూండటంతో.. వారి మధ్య ఓ అభిప్రాయానికి వచ్చే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. అదే సమయంలో… ఇప్పుడు… కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. విపక్ష పార్టీల వ్యవహారాల్ని చాలా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం పడింది కాబట్టి… ఇప్పటికిప్పుడు దావోస్ కన్నా.. రాజకీయమే బెటరని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం దావోస్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.